Amazon: 18000 మంది ఉద్యోగులకు ఉద్వాసన!

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేవథ్యంలో అన్ని రంగాలపై ప్రభావం పడుతుందనే చెప్పాలి. ఇది ఆర్థికమాంద్యానికి దారితీస్తుండగా, ఈ ప్రక్రియలో భాగంగా ఐటీ ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు. ప్రముఖ ఐటీ కంపెనీలు ఇష్టానుసారంగా ఉద్యోగులను తీసివేయడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. తాజాగా అమేజాన్ మరికొందరు ఉద్యోగులకు స్వస్తి పలకడం కలకలం సృష్టిస్తోంది.
ఇటీవలే అమెజాన్ 10000 మంది ఉద్యోగులను తీసివేసిన సంఘటన మరువక ముందే తాజాగా మరింత మంది ఉద్యోగులకు స్వస్తి పలకబోతున్నట్లు ఆ సంస్థ సీఈఓ ఆండి జెస్సీ తెలియజేశారు. ఉద్యోగం కోల్పోయే వారి సంఖ్య దాదాపు 18000 లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.
ఈ కామర్స్ రంగం వారిపై ఈ ప్రభావం పడుతుండొచ్చు అని ట్రెడ్ వర్గాలు భావిస్తున్నాయి. ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్నతరువాత ఆ సంస్థలో పనిచేసే 3500 మంది ఉద్యోగులను అక్టోబర్‌లో తీసివేసింది. అలాగే ఫేస్‌బుక్ కూడా గత ఏడాదిలో 11000 వేల మంది ఉద్యోగులను ఆపరేషన్ కాస్ట్ తగ్గించుకోవడం కోసం తొలగించింది. ఇలా చాలా కంపెనీలు వారి ఉద్యోగులను తీసి వేస్తున్నారు. ఇలానే కొనసాగితే 2024 వరకు చాలా మంది ఐటీ ఉద్యోగులు రోడ్డున పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com