America: ఆ తుపాకి తల్లిదే..

America: ఆ తుపాకి తల్లిదే..
టీచర్‌పై కాల్పులు జరిపిన ఆరేళ్ల బాలుడు

గురువారం అమెరికాలోని వర్జీనియాలో రిచ్‌నెక్‌ స్కూల్‌లో 6ఏళ్ల బాలుడు టీచర్‌పై కాల్పులు జరిపిన ఘటన తెలిసిందే. అమెరికాలో పెరుగుతున్న తుపాకీ సంస్కృతికి అద్దం పడుతున్న ఈ ఘటనలో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. చిన్నారి చేతికి తుపాకీ చేరిన వైనానికి పోలీసులే హుతాశులయ్యారు.


ఆ కాల్పుల్లో బాలుడు వాడిన తుపాకి తన తల్లీదేనని ఆమె లైసెన్స్‌ తీసుకొనే కొన్నదని పోలీసులు గుర్తిచారు. ఆ బాలుడు తుపాకీనీ తన బ్యాక్‌ప్యాక్‌లో తెచ్చుకుని క్లాస్‌ జరుగుతుండగా తన టీచర్‌పై కావలనే కాల్పుడు జరిపాడని పోలీస్‌ చీఫ్‌ స్టీవ్‌ డ్య్రూ చెప్పారు.

ఈ ఘటణలో గాయపడ్డ 25ఏళ్ల జ్వెర్నర్‌ తానే స్వయంగా విషయాన్ని స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకుని వెళ్లారని తెలుస్తోంది. ఆమె తరగతి గది వీడే ముందు ఇతర చిన్నారులు సురక్షితంగా ఉన్నారో లేదో పరీక్షిచారని వెల్లడించారు. అందరూ క్షేమంగానే ఉన్నారని ఖరారు చేసుకున్నాకే అక్కడి నుంచి వెళ్లారని తెలిపారు. ఆమెను ఆసుపత్రికి తరలిస్తున్నప్పుడు కూడా పిల్లల క్షేమసమాచారాన్ని అడిగి తెలుసుకున్నారని పోలీసులు తెలిపారు.


కాల్పులు జరిపిన విద్యార్థి డెస్క్‌ వద్ద 9 ఎంఎం టారస్ పిస్టల్‌తో పాటు అతని బ్యాక్‌ప్యాక్, మొబైల్ ఫోన్ అలాగే బుల్లెట్ పౌచ్ ను పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనతో షాక్‌కు గురైన విద్యార్థులు పూర్తిగా కోలుకోవడానికి మరో వారం పాటు స్కూల్‌కు సెలవు ప్రకటిస్తున్నట్లు పోలీసు చీఫ్‌ స్టీవ్‌ డ్య్రూ వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story