America: కాల్పుల మోత.. ఏడుగురు మృతి

America:  కాల్పుల మోత.. ఏడుగురు మృతి
అమెరికాలో గన్ కల్చర్ కు బలవుతున్న పౌరులు; కొత్త చట్టాలను ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం....

అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో ఏడుగురు మరణించారు. అమెరికా కాలిఫోర్నియాలోని హాఫ్ మూన్ బే నగరంలోని వ్యవసాయకేంద్రాల వద్ద మంగళవారం కాల్పులు చోటు చేసుకున్నాయి. ఒక ప్రదేశంలో నలుగురు చనిపోగా, ఒక వ్యక్తి గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మరో ప్రదేశంలో ముగ్గురు చనిపోయినట్లు చెప్పారు.

చైనా వ్యవసాయ కార్మికులపై కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. అనుమానితుడిగా జావో చున్లీ (67) గా గుర్తించారు. అనంతరం అతడు పారిపోయాడని చెప్పారు. హాఫ్ మూన్ బే సబ్ స్టేషన్ పార్కింగ్ ప్లేస్ లో అనుమానంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకోగా, జావో చున్లీగా పోలీసులు గుర్తించారు. అతని వద్దనుండి గన్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితున్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు పోలీసులు.

వారంలోపు మరోసారి కాల్పులు...

కాలిఫోర్నియాలోని మాంటెరీ పార్క్ లో జరిగిన చైనీస్ న్యూ ఇయర్ వేడుకలో 72 ఏళ్ల వ్యక్తి 10 మందిని చంపిన వారంలోపే ఈ ఘటన జరిగింది. పోలీసులు నిందితున్ని చట్టుముట్టగా అప్పటికే అతను తుపాకీ గాయంతో ఉన్నాడని తెలిపారు. సంఘటనా స్థలంలో ప్రాణాలు విడిచినట్లు ప్రకటించారు పోలీసులు.


అమెరికాలో గన్ కల్చర్ పౌరులను బలి తీసుకుంటోంది. యూఎస్ ప్రభుత్వం గన్ కల్చర్ ను కట్టడి చేసేందుకు చట్టాలను తీసుకురానుండగా... కాల్పుల ఘటనలు మరింత పెరుగుతున్నాయి. గతేడాది అమెరికాలో 647 కాల్పుల ఘటనలు చోటుచేసుకోగా... 44వేల మంది తుపాకీ గాయాలతో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story