America: ఇదేందయ్యాఇది...

America: ఇదేందయ్యాఇది...
బైడన్ భార్యను ముద్దాడేసిన కమలా హ్యారిస్ భర్త; షాక్ కు గురవుతున్న అమెరికా పౌరులు..

ప్రస్తుతం అమెరికా ప్రభుత్వాన్ని ఏడు సెకెన్ల నిడివిగల ఓ వీడియో ఊపేస్తోంది. ఇద్దరి వ్యక్తుల మధ్య యాధృశ్చికంగా చోటుచేసుకున్న ఓ ముద్దే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అయితే ఆ ముద్దు అహసజంగా తోచడంతో అమెరికా జనాలు డైలమాలో పడ్డారు. పాశ్చాత్య దేశాలకే దిమ్మతిరిగేంతగా ఆ ముద్దులో ఏముందబ్బా అని మరీ ఎక్కువ ఆలోచించకండి.


విషయం ఏమిటంటే... ఆ ముద్దు దేశ అధ్యక్షుడి భార్య, ఉపాధ్యక్షురాలి భర్త మధ్య చోటుచేసుకోవడంతోనే అసలు మతలబు ఉంది. నిజమే... అమెరికా దేశ అధ్యక్షుడు జో బైడెన్ భార్య, ప్రథమ పౌరురాలు అయిన జిల్ బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ భర్త డౌగ్ ఎమాఫ్ పరపస్పరం ముద్దాడుకోవడంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. బెన్నీ జాన్సన్ అనే విలేఖరి ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.


ఇక అసలు అక్కడ ఏం జరుగుతోందంటూ కొందరు ఆశ్చర్యపోతుంటే, మరి కొందరు ఇదెక్కడి విడ్డూరమంటూ బుగ్గలు నొక్కేసుకుంటున్నారు. అధ్యక్షుడు బైడెన్ స్టేట్ ఆఫ్ యూనియన్ ను అడ్రెస్ చేస్తున్న నేపథ్యంలో జిల్, ఎమాఫ్ ఒకరినొకరు అభినందించుకుని, అప్రయత్నంగానే ముద్దాడుకున్నారు. అనంతరం జిల్ ఎమాఫ్ పక్కనే నించున్నారు. అయితే వారి ముద్దును ఏమాత్రం గమనించనట్లే చుట్టుపక్కలవారు కరతాళధ్వనుల్లో నిమగ్నమయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నిమిషాల వ్యధిలోనే ఏడు లక్షల వ్యూస్ దక్కించుకుంది.

Tags

Read MoreRead Less
Next Story