అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్.. జనవరి 20న ప్రమాణ స్వీకారం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ గెలిచినట్టు అమెరికా కాంగ్రెస్ ధృవీకరించింది. విజయానికి కావాల్సిన 270 వోట్లను బైడెన్ సాధించినట్టు కాంగ్రెస్ పేర్కొంది. క్యాపిటల్ బిల్డింగ్‌పై ట్రంప్ మద్దతుదారుల దాడితో కాంగ్రెస్ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆ తరువాత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఆధ్వర్యంలో రెండు సభలు సంయుక్తంగా సమావేశమై బైడెన్ విజయాన్ని ధృవీకరించాయి.
దీనికి కొందరు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ మాత్రం బెడెన్‌దే విజయమంటూ ప్రకటించింది. దీంతో బైడెన్ వైట్ హౌస్‌కీ.. ట్రంప్ సొంత హౌస్‌కు వెళ్లడం ఖాయమైపోయింది. అవాంతరాలన్నీ తొలగిపోవడంతో జో బెడెన్ జనవరి 20న అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
అధికార పీఠం వదిలిలేది లేదంటూ కల్లోలానికి కారణం అవుతున్న ట్రంప్‌కు ఈ పరిణామంతో భారీ షాక్ తగిలినట్టైంది. అమెరికా చట్టసభల వేదిక క్యాపిటల్ బిల్డింగ్‌పై ట్రంప్ మద్దతు దారులు దాడి చేయడంతో ఆసమయంలో అమెరికా చట్టసభల్లో ఉన్న సభ్యులు ఒక్కసారిగా ఆందోళనకు లోనయ్యారు.
అమెరికా ఎగువ, దిగు సభల సమావేశాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే..పరిస్థితి అదుపులోకి వచ్చాక అమెరికా చట్టసభ సభ్యులు మరోసారి సమావేశమై బెడెన్ విజయాన్ని ధృవీకరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com