America : బహుమతులను ట్రంప్ వెల్లడించలేదు

America : బహుమతులను ట్రంప్ వెల్లడించలేదు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌజ్ లో ఉన్నప్పుడు విదేశాల నుంచి అందుకున్న బహుమతులను బహిర్గతం చేయలేదని అన్నారు హౌజ్ ఓవర్ సైట్ కమిటీ డెమోక్రాట్స్. బహిర్గతం చేయని బహుమతుల విలువ రెండు లక్షల 50 వేల డాలర్లని తెలిపారు. శుక్రవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం ట్రంప్ అందుకున్న 117 బహుమతులలో 17 భారతదేశం నుంచి అందుకున్నట్లు తెలిపారు. వీటి విలువ దాదాపు 50వేల డాలర్లని నివేదిక పేర్కొంది.


భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రధాని మోదీ ద్వారా పంపబడిన రూ.3.8 లక్షల విలువైన తాజ్ మహల్ ప్రతిరూపం, మోదీ ఇచ్చిన 1.5 లక్షల బహుమతితో పాటు యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ ఇచ్చిన రూ.7లక్షల ఖరీదైన మక్రానా మార్బుల్ వాజ్ ను ట్రంప్ బహిర్గతం చేయలేదని చెప్పారు. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, వారి కుటుంబాలకు విదేశీ అధికారుల ఇచ్చే బహుమతులలో వందల డాలర్లకంటే ఎక్కువ ఖరీదైన బహుమతులను స్టేట్ డిపార్ట్ మెంట్ కు తెలపాలని అధికారులు స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story