అమెరికా పెద్దన్న ఎవరు..? కొద్ది గంటల్లో..

అమెరికా పెద్దన్న ఎవరు..? కొద్ది గంటల్లో..
అమెరికా పెద్దన్న ఎవరవుతారు..? శ్వేతసౌధాన్ని పాలించేది ఎవరు..? ఈ ప్రశ్నలన్నిటికీ కొద్ది గంటల్లో తెరపడనుంది.. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌కు మరోసారి అవకాశం ఇస్తారా..

అమెరికా పెద్దన్న ఎవరవుతారు..? శ్వేతసౌధాన్ని పాలించేది ఎవరు..? ఈ ప్రశ్నలన్నిటికీ కొద్ది గంటల్లో తెరపడనుంది.. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌కు మరోసారి అవకాశం ఇస్తారా, డెమోక్రటిక్‌ అభ్యర్థి బైడెన్‌ను ఎన్నుకుంటారా అనేది ఉత్కంఠను రేపుతోంది.. ఎవర్ని అధ్యక్షుడిగా ఎన్నుకోవాలో ఇప్పటికే నిర్ణయించుకున్న ప్రజలు ఓటు ద్వారా తీర్పు చెబుతున్నారు.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోలింగ్‌ జోరుగా కొనసాగుతోంది.. న్యూ హాంప్‌ షైర్‌లో మొదటి ఓటు నమోదైంది.. అమెరికాలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అన్ని జాగ్రత్తల మధ్య ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇండియానా, కనెక్టికట్‌లో పోలింగ్‌ కొనసాగుతోంది.. మొత్తం అమెరికాలో 23.9 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. ఆరు కోట్ల మంది వరకు ఈరోజు ఓటు వేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ ఎన్నికల్లో పది కోట్ల మంది ప్రజలు ముందస్తుగా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.. హవాయ్‌, టెక్సాస్‌, మోంటారా రాష్ట్రాల్లో భారీగా ముందస్తు ఓట్లు పోలయ్యాయి.. అయితే, పోస్టల్‌ ఓట్లపై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనుమానం వ్యక్తం చేశారు.. రిగ్గింగ్‌ జరుగుతుందని ట్రంప్‌ ఆరోపిస్తుండగా.. ముందస్తు ఓటింగ్‌పై డెమోక్రటిక్‌ అభ్యర్థి బైడెన్‌ హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్‌ పూర్తయిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.. మరోవైపు ఓటింగ్‌, ఫలితాలు ఆలస్యమైతే నిరసనలు, గొడవలు జరిగే అవకాశం ఉందన్న ఆందోళన నేపథ్యంలో న్యూయార్క్‌లో అధికారులు అప్రమత్తమయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story