విరాళాల సేకరణలో వెనుకబడిన ట్రంప్

విరాళాల సేకరణలో వెనుకబడిన ట్రంప్
ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో.. అమెరికా ఎన్నికల కోసం కూడా అదే స్థాయిలో ఎదురు

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో.. అమెరికా ఎన్నికల కోసం కూడా అదే స్థాయిలో ఎదురు చూస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇరు పార్టీలు ప్రచారం జోరు పెంచాయి. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు విరాళాలు సేకరణలో కూడా పోటీపడుతున్నారు. అయితే, ట్రంప్ కంటే జో బిడెన్ రికార్డు స్థాయిలో విరాళాలు అందుకున్నారు. ఇప్పటివరకూ జోబిడెన్ 3.43 వేల కోట్ల రూపాయల విరాళాలు సేకరించగా.. డోనాల్ ట్రంప్‌కు 2.39 వేల కోట్లు విరాళాలు మాత్రమే సేకరించారు. ప్రత్యర్థి కంటే ట్రంప్ వేయి కోట్లు వెనుకంజలో ఉన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఇలాంటి పరిణామం జరగడం ఇదే తొలిసారి. విరాళాల సేకరణను ఒక ప్రామాణికంగా తీసుకొని జో బిడెన్ గెలుపుకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు తెలుపుతున్నారు. రెండు పార్టీలు కూడా టీవీ, పేపర్, రేడియో వంటి మీడియాల ద్వారా కంటే సోషల్ మీడియాలో ఎక్కువ ప్రచారాన్ని చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story