America: నదిలో కూలిన హెలికాప్టర్.. భార్య, ముగ్గురు పిల్లలతో సహా సిమెన్స్ సీఈఓ మృతి

సిమెన్స్ స్పెయిన్ CEO అగస్టిన్ ఎస్కోబార్ గురువారం న్యూయార్క్‌లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. కొన్ని వారాల ముందు ఆయన భారతదేశాన్ని సందర్శించారు. అగస్టిన్తో పాటు, అతని భార్య మెర్స్ కాంప్రూబి మోంటల్ తో పాటు వారి 4, 5, 11 సంవత్సరాల వయస్సు గల ముగ్గురు పిల్లలు కూడా మరణించారని మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
గత నెలలో అగస్టిన్ బెంగళూరు, పూణే మరియు ముంబైలోని సిమెన్స్ హబ్‌లను సందర్శించారు. "బెంగళూరు, పూణే మరియు ముంబై అంతటా ఉన్న మా ప్రతిభావంతులైన టీమ్ తో కనెక్ట్ అవ్వడం ఎంతో సంతోషంగా ఉంది అని ఆయన లింక్డ్ఇన్ పోస్ట్‌లో రాశారు. భారతీయ కేంద్రాలలో జరుగుతున్న తమ కంపెనీ ఆవిష్కరణలు తనను ఆకట్టుకున్నాయని ఆయన అన్నారు.
సిమెన్స్ బెంగళూరు హబ్‌లో భవిష్యత్ అవకాశాలపై లోతుగా దృష్టి సారించడం, పూణేలోని తన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇంజనీరింగ్ మరియు ఆర్ అండ్ డి బృందంలో ఆవిష్కరణలను అన్వేషించడం మరియు ముంబైలోని కల్వాలోని తన బృందాలతో కనెక్ట్ అవ్వడం వంటి కీలక క్షణాలను అగస్టిన్ హైలైట్ చేశారు.
గురువారం నాడు, అగస్టిన్ ప్రయాణించిన హెలికాప్టర్ న్యూయార్క్ నుండి బయలుదేరింది. అది హడ్సన్ నదిలో పడిపోయే ముందు గాల్లోనే విడిపోయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com