అమెరికా అధ్యక్ష ఎన్నికలు : CNN పోల్‌లో బైడెన్‌కే మెజార్టీ

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : CNN పోల్‌లో బైడెన్‌కే మెజార్టీ
అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ ట్రంప్‌కి ప్రాభవం తగ్గుతున్నట్టే కనిపిస్తోంది. తాజాగా CNN నిర్వహించిన పోల్‌లో బైడెన్‌కే మెజార్టీ..

అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ ట్రంప్‌కి ప్రాభవం తగ్గుతున్నట్టే కనిపిస్తోంది. తాజాగా CNN నిర్వహించిన పోల్‌లో బైడెన్‌కే మెజార్టీ అమెరికన్లు మద్దతుపలుకుతున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌కి, డెమోక్రాట్ల అభ్యర్థి జో బైడెన్‌కి మధ్య జరిగిన తొలి డిబేట్ తర్వాత మెజార్టీ ప్రజలు బైడెన్‌వైపే నిలిచారు. సర్వేలో ఏకంగా బైడెన్‌కి 57 శాతం మద్దతు లభించింది. అదే సమయంలో ట్రంప్‌కి 41 శాతం మంది మాత్రమే సపోర్ట్‌గా నిలిచారు.

కరోనా వ్యాప్తిని అరికట్టడం, జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాటం, హెల్త్ కేర్‌, ఆర్థిక పరిస్థితులు గాడిన పడేయడం లాంటి వివిధ అంశాల వారీగా నిర్వహించిన పోల్‌లో అన్నిచోట్లా జోబైడెన్‌దే పైచేయిగా నిలిచింది. ఏ ఒక్క అంశంలో కూడా 38 శాతానికి మించి ఓటర్ల మద్దతు కూడగట్టుకోలేకపోయారు ట్రంప్. నెల రోజుల వ్యవధిలో బైడెన్‌కు 7 శాతం ప్రజా మద్దతు పెరిగింది. CNN సర్వే మాత్రమే కాదు వాల్‌స్ట్రీట్ జర్నల్ సహా మరికొన్ని సంస్థలు నిర్వహించిన సర్వేల్లో కూడా బైడెన్‌కే మెజార్టీ కనిపించడం విశేషం.

Tags

Read MoreRead Less
Next Story