America: రష్యాకు గట్టి వార్నింగ్ ఇచ్చిన అమెరికా..

America: రష్యాకు గట్టి వార్నింగ్ ఇచ్చిన అమెరికా..
America: ఉక్రెయిన్‌పై అణుబాంబు వేస్తామంటూ పదే పదే హెచ్చరిస్తున్న రష్యాకు గట్టి వార్నింగ్ ఇచ్చింది అమెరికా.

Russia: ఉక్రెయిన్‌పై అణుబాంబు వేస్తామంటూ పదే పదే హెచ్చరిస్తున్న రష్యాకు గట్టి వార్నింగ్ ఇచ్చింది అమెరికా. అణుదాడి చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవంటూ రష్యాకు గట్టి హెచ్చరికలు పంపింది. ఒకవేళ రష్యా అనుకున్నంత పని చేస్తే.. ఎలా స్పందించాలో ముందే ఓ వ్యూహాన్ని సిద్ధం చేసి పెట్టుకున్నామని అమెరికా తెలిపింది. అణ్వాయుధం ప్రయోగించిన దేశంగా రష్యా కూడా తీవ్ర పరిణామాలు అనుభవించాల్సి ఉంటుందని చాలా స్పష్టంగా చెప్పింది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకన్‌ అధికారికంగా ధ్రువీకరించారు.

ఉక్రెయిన్‌పై చేపడుతున్న సైనిక చర్యలో రష్యా ఎదురుదెబ్బలు తింటోంది. ఉక్రెయిన్‌ను తన ఆర్మీ బలంతో దారికి తెచ్చుకోలేకపోయింది. అంతర్జాతీయ నిపుణులు.. రష్యా ఓడిపోయిందంటూ కామెంట్ చేస్తున్నారు. దీంతో ఓడిపోయామన్న మాటను తట్టుకోలేకపోతున్న రష్యా.. చిన్నసైజు టాక్టికల్‌ అణు బాంబును వాడొచ్చనే అనుమానాలు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. పైగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సైతం.. ఈమధ్య సైనిక సమీకరణ ప్రకటన చేశారు. దీంతో పశ్చిమ దేశాల్లో అణుభయాలు మరింత పెరిగిపోయాయి.

అణుబాంబు దాడికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో రష్యాకు.. ప్రైవేటుగా ఓ సందేశం పంపింది అమెరికా. అణు యుద్ధం అంటూ మొదలుపెడితే తీవ్ర పరిణామాలు తప్పవని ఈ సందేశంలో తెలిపింది. అణ్వాయుధాలపై అనవసరంగా మాట్లాడటం తగ్గించుకోవాలని, అణ్వాయుధం వినియోగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని మెసేజ్ పంపింది. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్‌ సులెవాన్‌ కూడా ఇలాంటి హెచ్చరికలే చేశారు. అణుబాంబు వేస్తే.. అమెరికా రష్యాపై విరుచుకుపడడం ఖాయమని తేల్చి చెప్పింది.

Tags

Read MoreRead Less
Next Story