America: చాలని ఆదాయం.. తీరని ఆకలి.. అమెరికా సైనికులకు..

America (tv5news.in)

America (tv5news.in)

America: జై జవాన్, జై కిసాన్.. ఈ ఇద్దరు లేకపోతే ప్రజలు లేరు అంటుంటారు.

America: జై జవాన్, జై కిసాన్.. ఈ ఇద్దరు లేకపోతే ప్రజలు లేరు అంటుంటారు. కేవలం ఇండియాలోనే కాదు.. ఏ దేశంలో అయినా సైనికుడు లేనిదే.. ఎవరికీ రక్షణ లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఏ కష్టం రాకుండా మనల్ని కవచం లాగా కాపాడేది సైనికులే.. ఒకవేళ వారిని దాటి ఏదైనా ప్రమాదం మన వరకు వచ్చినా కూడా దాన్ని అడ్డుకుని మనకు అండగా నిలబడేది కూడా సైనికులే.. మరి అలాంటి సైనికుల కుటుంబాలకు అండగా నిలిచేదెవరు..?

అమెరికాకు అన్ని దేశాలకంటే బలమైన సైన్యం ఉంది. ఆ సైన్యానికి ఎదురెళ్లి మరెవరూ నిలబడలేరు. కానీ అలాంటి సైనిక కుటుంబాలు ప్రస్తుతం దయనీయ స్థితిని గడుపుతున్నాయి. అందరినీ వదిలి సైనికులు సరిహద్దుల్లో పనిచేయాలంటే.. ముందు వారి కుటుంబ సభ్యులు సంతోషంగా ఉన్నారన్న నమ్మకం వారికి రావాలి. కానీ ఆ నమ్మకం లేకుండానే వారి కుటుంబాలను వదిలెళ్లి పనిచేయాల్సిన పరిస్థితి అమెరికన్ సైనికులకు ఏర్పడింది.

అమెరికన్ సైన్యంలో కింద స్థాయిలో ఉండేవారి జీతాలు చాలా తక్కువ. కోవిడ్ ముందు వారి కుటుంబాలలో భార్య కూడా పనిచేసేది. అందుకే వారిద్దరి జీతంతో ఇళ్లు గడుపుకునేవారు. కానీ కోవిడ్ వల్ల చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. ఒకరి చాలీచాలని జీతంపైనే ఇళ్లు గడవడం అనేది కష్టంగా మారింది. కనీసం కడుపునిండా తినలేని ఇబ్బంది ఏర్పడింది.

సైనికుల కుటుంబాలు కాబట్టి వేరేవారిని చేయి చాచి సాయం అడగడానికి కూడా వారు ఇష్టపడరు. ప్రాణాలకు తెగించి దేశాన్ని కాపాడేవారి జీతం వారి కుటుంబాలకు సరిపోయేంత కూడా లేకపోతే ఎలా అని చాలామంది సైనికులు వాపోతున్నారు. సైన్యంలో దిగువస్థాయి ర్యాంకుల్లో పని చేసే సైనిక కుటుంబాల్లో 29 శాతం మంది తమ పిల్లలకు వేళకు ఆహారం అందించలేకపోతున్నారని ఓ సంస్థ ఇటీవల వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story