వైజాగ్‌లో అమెరికన్ కార్నర్‌తో ఎంత ఉపయోగం అంటే...

వైజాగ్‌లో అమెరికన్ కార్నర్‌తో ఎంత ఉపయోగం అంటే...
అమెరికన్ కార్నర్.. దీని గురించి తక్కువమందే వినుంటారు. ఇది పలు దేశాల్లోని పేరున్న విశ్వవిద్యాలయాలతో యూఎస్ చేసే ఒప్పందం.

అమెరికన్ కార్నర్.. దీని గురించి చాలా తక్కువమందే వినుంటారు. అమెరికన్ కార్నర్ అంటే పలు దేశాల్లోని పేరున్న విశ్వవిద్యాలయాలతో యూఎస్ ఎంబెసీ చేసే ఒప్పందం. ఆయా యూనివర్సిటీలలో అమెరికాకు సంబంధించిన పుస్తకాలను, అక్కడి సమాచారాన్ని విద్యార్థులకు తెలిసేలా చేసేదే అమెరికన్ కార్నర్. అంటే ఇదొక చిన్న సైజ్ అమెరికా లాంటిదే. మన దేశంలో ఇప్పటివరకు రెండే అమెరికన్ కార్నర్‌లు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని ఆంధ్ర యూనివర్సిటీలో మూడో అమెరికన్ కార్నర్‌ను ఈ మధ్యనే ప్రారంభించారు. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్‌మెహన్ రెడ్డి. ఈ ఓపెనింగ్ ఈవెంట్‌లో యూఎస్ కాన్సిల్ జెనరల్ ఆఫ్ హైదరాబాద్ జోయెల్ రీఫ్‌మ్యాన్‌తో పాటు యూఎస్‌ఏఐడీ మిషన్ డైరెక్టర్ వీణా రెడ్డి పాల్గొన్నారు. ఈ అమెరికన్ కార్నర్ ఇక్కడ ఉన్న విద్యార్థులు అమెరికా వెళ్లి చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి అవకాశాలు పెరిగేలా చేస్తుంది.

అమెరికన్ కార్నర్‌ విశాఖపట్నానికి రావడం ఆ నగరానికి ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఆ ప్రాంతం నుండి విద్యార్థులంతా అమెరికాకు సంబంధించిన సమాచారాన్ని, స్టడీస్‌కు సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ను తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. అమెరికన్ కార్నర్‌ ముఖ్యంగా అమ్మాయిలు ఇతర దేశాలకు వెళ్లి చదువుకోగలిగే ధైర్యాన్ని కల్పించడానికి ప్రారంభమయ్యింది. యూఎస్ కాన్సిల్ జెనరల్ ఆఫ్ హైదరాబాద్ చెప్పింది కూడా ఇదే. వారికి భాషతో పాటు సాధికారతను కూడా నేర్పించడం అమెరికన్ కార్నర్ లక్ష్యం. ఇది కచ్చితంగా అమెరికాకు, విశాఖపట్నానికి మధ్య దూరాన్ని తగ్గిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story