Male Contraceptive Pill: పురుషులకూ గర్భ నిరోధక పిల్!

అగ్రరాజ్యం అమెరికా పరిశోధకులు కుటుంబ నియంత్రణలో విప్లవాత్మకమైన ఆవిష్కరణ చేశారు. పురుషుల్లో ప్రత్యుత్పత్తికి దోహదపడే టెస్టోస్టిరాన్ హార్మోన్లకు అడ్డుకట్ట వేసి గర్భం రాకుండా అరికట్టే సరికొత్త పిల్‌ను కనుగొన్నారు. ఇది స్పెర్మ్ (వీర్యం) ఉత్పత్తిపై ప్రభావం చూపి గర్భ నిరోధకతగా పని చేస్తుందని పరిశోధకులు వెల్లడించారు. వైసీటీ- 529 అనే ఈ పిల్‌ను కొలంబియా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసొటా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, యూవర్ ఛాయిస్ థెరప్యూటిక్స్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.
ఇప్పటికే పురుషులపై మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయినట్టు పరిశోధకులు తెలిపారు. సేఫ్టీ, ప్రభావవంత పనితీరుకు సంబంధించి రెండో దశ క్లినికల్ ట్రయల్స్ త్వరలో జరపనున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. కాగా, పురుషులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించక ముందు మగ ఎలుకలపై వైసీటీ-529 డ్రగ్‌ను ప్రయోగించారు.
నాలుగు వారాల వ్యవధిలోనే వాటి స్పెర్మ్ కౌంట్ భారీగా తగ్గింది. అలాగే 99 శాతం ప్రభావవంతంగా పని చేసినట్టు పరిశోధకులు గుర్తించారు. అంతేగాక ఈ పిల్ వాడకాన్ని ఆపేసిన ఆరు వారాల్లోగా ఎలుకలు మళ్లీ ప్రత్యుత్పత్తి సామర్థ్యాన్ని పొందినట్టు తెలిపారు. వైసీటీ-529కు ఆమోదం లభిస్తే కొంతమేర అవాంఛనీయ గర్భధారణను అరికట్టే అవకాశం ఉంది. ఇప్పటివరకు కుటుంబ నియంత్రణ, గర్భ నిరోధకత అంటే మహిళ బాధ్యత అనే అపోహ సమాజంలో ఉన్నది. అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా అవాంఛనీయ గర్భధారణ రేటు సుమారు 50 శాతం వరకు ఉన్నది. అమెరికాలోని ఎఫ్‌డీఏ 20కి పైగా గర్భ నిరోధక డ్రగ్స్‌కు ఆమోదం తెలిపినప్పటికీ, పురుషులకు మాత్రం కండోమ్, వ్యాసెక్టమీ తప్ప మరో మార్గం లేదు. ఈ నేపథ్యంలో వైసీటీ-529కు ఆమోదం లభిస్తే కొంతమేర అవాంఛనీయ గర్భధారణను అరికట్టే అవకాశం ఉంది. అంతేకాదు, దీని వల్ల మహిళలపై భారం తగ్గే ఆస్కారం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com