Flour Prices: కిలో గోధుమ పిండి రూ.320…ఎక్కడంటే…

Flour Prices: కిలో గోధుమ పిండి రూ.320…ఎక్కడంటే…
తీవ్ర ఆర్థిక సంక్షోంభంలో చిక్కుకున్న దాయాది దేశం

పాకిస్థాన్‌ తీవ్ర ఆర్థిక సంక్షోంభంలో చిక్కుకున్నది. దేశంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అక్కడి గోధుమ పిండి ధరలు తెలిస్తే గుండెలు వణికిపోతాయి. ఎంతలా అంటే కిలో పిండి కొనాలంటే అక్కడి ప్రజలు రూ.320 లు వెచ్చించాల్సిందే. దీంతో ప్రపంచంలోనే గోధుమ పిండి ధరలు అత్యధికంగా పాక్‌లోనే ఉన్నాయని పాకిస్థాన్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ తెలిపింది.

దేశంలోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన కరాచీలో అధికమైన 20 కిలోల గోధుమ పిండి బస్తా ధర రూ.3200కు చేరింది. ఇక పాకిస్తాన్ లోని హైదరాబాద్‌లో రూ.3040, ఇస్లామాబాద్‌, రావల్పిండి, సియాల్‌కోట్‌, ఖుజ్దర్‌లో 20 కిలోల బస్తాపై రూ.106, రూ.133, రూ.200, రూ.300 చొప్పున పెరిగాయి. వాటితోపాటు బహవల్పూర్‌, ముల్తాన్‌, సుక్కూర్‌, క్వెట్టా పట్టణాల్లో గోధుమపిండి ధరలు చుక్కలనంటాయి. అటు చక్కెర ధర కూడా రూ.160కి పెరిగింది. ఇప్పుడే కాదు ఈ ఏడాది జనవరిలో కూడా పాకిస్తాన్లో ఇదే పరిస్థితి ఏర్పడింది. అయితే అప్పుడు గోధుమపిండి పారా 160 రూపాయలకు చేరింది. ఆ సమయంలో మార్కెట్‌లో బస్తాలను పొందడానికి ప్రతిరోజూ పదివేల మంది గంటలు పాటు ఎదురు చూసేవారు. ప్రభుత్వం మినీ ట్రక్కులు, వ్యాన్‌లలో సాయుధ గార్డులతో కలిసి పిండి పంపిణీ చేస్తున్నప్పుడు వాహనాల చుట్టూ ప్రజలు గుమిగూడి ఒకరినొకరు తోసుకోవడంతో గందరగోళ దృశ్యాలు తరచుగా కనిపించాయి. పిండి వ్యాపారులు, స్థానికలు మధ్య అనేక ఘర్షణలు వెలుగులోకి వచ్చాయి.

గత కొంత కాలంగా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో పాక్ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రపంచంలోని మొదటి ఐదు అత్యల్ప నివాసయోగ్యమైన పట్టణాల్లో పాకిస్థాన్‌లోని కరాచీ కూడా స్థానం పొందిందని ఇప్పటికే ఇకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ తెలిపింది. ప్రపంచంలోని లాగోస్, అల్జీర్స్, ట్రిపోలీ, డమాస్కస్ నగరాల కంటే కరాచీ 169 వ స్థానంలో నిలిచింది.

నిజానికి పాకిస్తాన్ తన వినియోగ అవసరాలను తీర్చడానికి గోధుమలను దిగుమతి చేసుకుంటుంది, వీటిలో చాలా వరకు రష్యా మరియు ఉక్రెయిన్ నుంచి వస్తాయి . అయితే ఈ సంవత్సరం, యుద్ధం సరఫరాకు అంతరాయం కలిగించింది, అయితే గత సంవత్సరం వరదలు దేశీయ దిగుబడిని తగ్గించాయి.

Tags

Read MoreRead Less
Next Story