South Korea : మేమేం తక్కువ కాదు
దక్షిణ కొరియా మంగళవారం ఓ భారీ సైనిక కవాతు నిర్వహించింది. ఉత్తర కొరియా బెదిరింపుల నేపథ్యంలో వారిపై తన కఠిన వైఖరిని అవలంబిస్తూ దక్షిణ కొరియా దశాబ్దంలో తన మొదటి భారీ సైనిక కవాతును నిర్వహించింది. సియోల్‌లో జరిగిన ఈ కవాతులో వేలాది మంది సైనికులు, దక్షిణ కొరియా స్వదేశీ యుద్ధ ట్యాంకులు, స్వీయ-చోదక ఫిరంగితో పాటు యుద్ధ విమానాలు, డ్రోన్‌లు ఉన్నాయి. దక్షిణ కొరియా సాయుధ దళాల దినోత్సవం సందర్భంగా ఈ కవాతు జరిపింది.
క్షిపణి, అణ్వస్త్ర పరీక్షలతో నిత్యం బిజీగా గడిపే ఉత్తర కొరియా ఆగర్భ శత్రుదేశమైన దక్షిణ కొరియాపై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. అందుకే ఆ దేశంలోని లక్ష్యాలను నామరూపాల్లేకుండా చేసేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. అయితే ఏ సారి తమ సత్తా చూపడానికి సిద్ధం అయినది ఉత్తర కొరియా కాదు దక్షిణ కొరియా. దక్షిణ కొరియా చివరిసారిగా 2013లో సైనిక కవాతును నిర్వహించింది. నార్త్ కొరియా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగంపై ప్రతిగా దక్షిణ కొరియా ఈ కవాతు జరిపింది. దక్షిణ కొరియా దేశంలో యూఎస్ సైనికులు కూడా ఈ కవాతులో చేరారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. సియోల్ ప్రధాన వాణిజ్య, వ్యాపార జిల్లా గుండా సియోల్ నడిబొడ్డున ఉన్న విశాలమైన ప్యాలెస్‌కి ద్వారం ఉన్న గ్వాంగ్‌వామున్ ప్రాంతానికి 2 కిలోమీటర్ల దూరంలో ఈ సైనిక కవాతు నిర్వహించారు.
యున్ ప్యోంగ్యాంగ్ దురాక్రమణకు పాల్పడితే దానికి వ్యతిరేకంగా వాషింగ్టన్, టోక్యోలతో సైనిక కూటమిని చురుకుగా బలోపేతం చేశామని దక్షిణ కొరియా అధ్యక్షుడు యున్ సుక్ యోల్ చెప్పారు. మంగళవారం నాటి కవాతు సియోల్ శివార్లలోని సియోంగ్నామ్‌లోని వైమానిక స్థావరం వద్ద ప్రారంభం అయింది. దక్షిణ కొరియా ఈ సైనిక కవాతులో హ్యూన్‌మూ క్షిపణులు, ఎల్-శామ్ క్షిపణి ఇంటర్‌సెప్టర్లు, ఎఫ్-35 జెట్‌లు,మొట్టమొదటిగా దేశీయంగా అభివృద్ధి చేసిన యుద్ధ విమానం కేఎఫ్-21లను బహిరంగ ప్రదర్శనలో ఉంచింది.
దక్షిణ కొరియా యూఎస్ మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో సంయుక్తంగా అప్ గ్రేడెడ్ కంబైన్డ్ ఢిఫెన్స్ విన్యాసాలను ప్రదర్శించారు. ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ రష్యా దేశ పర్యటన నుంచి తిరిగి వచ్చిన వారం తర్వాత ఈ కవాతు జరిపారు. ఈ సమయంలో కిమ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో సైనిక సహకారాన్ని పెంచుకోవడానికి అంగీకరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com