18 Dec 2020 6:13 AM GMT

Home
 / 
అంతర్జాతీయం / నా రిటైర్మెంట్‌కి...

నా రిటైర్మెంట్‌కి కారణం.. బోర్డు నన్ను.. : పాక్ బౌలర్ అమిర్

ఇంటర్వ్యూలో 28 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించాడు.

నా రిటైర్మెంట్‌కి కారణం.. బోర్డు నన్ను.. : పాక్ బౌలర్ అమిర్
X

పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ అమీర్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికాడు. జాతీయ బోర్డు నిర్వహణ తనను "మానసికంగా హింసించింది" అని ఆరోపించాడు. పాకిస్తాన్ వెబ్‌సైట్ 'ఖేల్-షెల్' విడుదల చేసిన వీడియో ఇంటర్వ్యూలో 28 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించాడు.

"నేను క్రికెట్ నుండి తప్పుకుంటున్నాను ఎందుకంటే నేను మానసికంగా హింసించబడ్డాను. ఈ హింసను నేను భరించలేను. నేను 2010 నుండి 2015 వరకు హింసను ఎదుర్కొన్నాను అందుకే ఇక నేను ఆడలేను. అమీర్ గత సంవత్సరం టెస్టులను విడిచిపెట్టి, వైట్-బాల్ క్రికెట్ పై దృష్టి పెట్టాడు. ఎందుకంటే తన శరీరం అన్ని ఫార్మాట్లను ఆడటానికి సహకరించడం లేదని భావించాడు. తను 2009 లో అరంగేట్రం చేసిన తరువాత 36 టెస్టులలో 119 వికెట్లు సాధించాడు. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొని 2010 నుండి 2015 వరకు అతడిపై ఐదేళ్ల నిషేధం విధించింది పాక్ క్రికెట్ బోర్డు.

పనిభారం కారణంగా అమీర్ టెస్ట్ నుంచి తప్పుకోలేదని, ఏ కారణం చేత తప్పుకున్నాడో బౌలర్‌కు బాగా తెలుసునని బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ పేర్కొన్నాడు. 2009 ప్రపంచ టి 20 కప్ గెలిచిన పాకిస్తాన్ జట్టులో అమీర్ ఒక భాగమయ్యాడు. 2017 లో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలుచుకున్నప్పుడు కూడా అతడి పాత్ర ఉంది. మాజీ పిసిబి చీఫ్ నజమ్ సేథి, పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహీద్ అఫ్రిది అనే ఇద్దరు వ్యక్తులు మాత్రమే తనకు సపోర్ట్‌గా ఉన్నారని అన్నాడు.

ఇది నా వ్యక్తిగత నిర్ణయం.. దేశం కోసం ఆడడం ఇష్టం లేదని విమర్శలు వస్తున్నాయి. అయితే దేశం కోసం ఎవరు ఆడడానికి ఇష్టపడరు అని అతడు అన్నాడు. బుధవారం ముగిసిన శ్రీలంక ప్రీమియర్ లీగ్ (ఎల్‌పిఎల్) లో అమీర్ పాల్గొన్నాడు. గాలే గ్లాడియేటర్స్ కోసం టోర్నమెంట్లో అతను అనూహ్యంగా బౌలింగ్ చేశాడు, జాఫ్నా స్టాలియన్స్ చేతిలో ఫైనల్ రౌండ్‌లో ఓడిపోయిన తరువాత రన్నరప్‌గా నిలిచాడు.

Next Story