Modi : 508 రైల్వేస్టేషన్లకు శంకుస్థాపన

Modi : 508 రైల్వేస్టేషన్లకు శంకుస్థాపన
అభివృద్ధే లక్ష్యంగా పయనిద్దామని పిలుపు నిచ్చిన మోదీ

దేశవ్యాప్తంగా ఉన్న రైల్వేస్టేషన్లను ఆధునికీకరించే లక్ష్యంతో కేంద్రం ప్రవేశపెట్టిన పథకం అమృత్ భారత్ స్టేషన్ .ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 508 రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధి పనులకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. రైల్వేస్టేషన్లలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా చేస్తున్న ఈ కార్యక్రమంలో భవిష్యత్తు ప్రణాళికల కోసం కొన్ని స్టేషన్ల నమూనాలను సైతం విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఆగస్టు ధన్యవాదాలు తెలపాల్సిన నెల అన్నారు. రఆగస్టు 7 దేశం మొత్తం చేనేత దినోత్సవం జరపుకుంటుందని, తరువాత వచ్చే వినాయక చతుర్థికి ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను మాత్రమే కొనుగోలు చేద్దామని ప్పిలుపునిచ్చారు. ఆగస్టు 8న క్విట్ ఇండియా దినోత్సవం రానుందని.. అవినీతి, కుంటుంబ పాలన భారత్ నుంచి వెళ్లిపోవాలని మోదీ పేర్కొన్నారు. ఆగస్టు 14న అఖండ భారతం ముక్కలైన రోజు అని, అఖండ భారతమే లక్ష్యమని ఆ రోజు గుర్తు చేస్తుందని ఆగస్టు 15 మళ్లీ మనం దేశం ‘హర్ ఘర్ తిరంగా’ జరుపుకోవాలని పిలుపిచ్చారు. అంతే కాదు దేశంలోని ప్రతిపక్షాలు విపరీత ధోరణిని అవలంభిస్తున్నాయని, వారు అభివృద్ధి పనులు చేయలేదు సరికదా బీజేపీ ప్రభుత్వం చేస్తున్నా చూడలేకపోతున్నారంటూ ప్రధాని విపక్షాలపై విమర్శలు కురిపించారు.


27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న రైల్వేస్టేషన్ల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.24,470 కోట్లను ఖర్చు చేయనుంది. స్థానిక సంప్రదాయాలకు అనుగుణంగా రైల్వే స్టేషన్లకు మెరుగులు దిద్దడం, కొత్త మెరుగు సూచికల ఏర్పాటు, ఆధునిక మౌళిక వస్తువుల కల్పనకు నిధులు కేటాయింపుతో మొత్తం 1309 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఒకేసారి 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులను ప్రధాని ప్రారంభించారు.

కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయనున్న 508 రైల్వే స్టేషన్లు 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. వీటిలో ఉత్తరప్రదేశ్ 55, రాజస్థాన్‌లలో 55, బీహార్‌లో 49, మహారాష్ట్రలో 44, వెస్ట్ బెంగాల్‌లో 37, మధ్యప్రదేశ్‌లో 34, అస్సాంలో 32, ఒడిశాలో 25, పంజాబ్‌లో 22, గుజరాత్ 21, తెలంగాణలో 21, జార్ఖండ్‌లో 20 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో 18, తమిళనాడులో 18, హర్యానాలో 15 కర్ణాటకలోని 13 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఇక ఆయా స్టేషన్లలో ఆధునీకరణనే దృష్టిలో ఉంచుకుని రూఫ్‌ ప్లాజాను నిర్మించనున్నారు. ఇంకా వెయిటింగ్ ఏరియా, లోకల్ ప్రొడక్ట్స్, ఫుడ్ కోర్ట్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఇతర వస్తువుల కోసం షాపింగ్ వంటివి కూడా ఏర్పాటు కానున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story