America: కోడి ముందా? గుడ్డు ముందా? సమాధానం కనిపెట్టేశాడు..

America: కోడి ముందా? గుడ్డు ముందా? సమాధానం కనిపెట్టేశాడు..
X
America: కోడి ముందా? గుడ్డు ముందా? చెప్పేకోండి చూద్దాం.. ఇది ఒక విప్పలేని చిక్కు ప్రశ్న కదా..

America: కోడి ముందా? గుడ్డు ముందా? చెప్పేకోండి చూద్దాం.. ఇది ఒక విప్పలేని చిక్కు ప్రశ్న కదా.. ఒకప్పుడు ఎవరినైనా సరదాగా ఆటపట్టించడానికి ఇలాంటి ప్రశ్నలు ఉపయోగించేవారు. తరువాత ఈ ఒక్క ప్రశ్న నుండి అనేక ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. కానీ వాటిలో ఏ ఒక్క ప్రశ్నకు కూడా సరైనా సమాధానం దొరకలేదు. అందుకే అమెరికాలోని ఓ జర్నలిస్ట్.. ఎలాగైనా ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కోవాలన్న ప్రయత్నంలో సఫలమయ్యాడట.

సరదాగా అడిగే కోడి ముందా? గుడ్డు ముందా? అనే సరదా ప్రశ్నకు సీరియస్‌గా సమాధానం వెతకడానికి కూడా ఎంతోమంది ప్రయత్నించారు. కానీ ఫలితం లేదు. కొన్నాళ్ల తరువాత ఇదొక అర్థం లేని ప్రశ్న అంటూ కొట్టిపారేశారు కూడా. గత కొంతకాలంగా రాబర్ట్ క్రుల్విచ్ అనే అమెరికన్ జర్నలిస్ట్ పరిశోధనలు చేసి ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కొని తన జర్నల్‌లో ప్రచురించారట.

చాలా ఏళ్ల క్రితం అసలు భూమిపై కోళ్లే ఉండేవి కాదట. వాటికి బదులుగా కొళ్లలాగే ఉండే పెద్ద పక్షులు ఉండేవట. వాటిని ప్రోటో కోడి అంటున్నారు ఇప్పటి పరిశోధకులు. ఇవి కాస్త కోళ్లలాగే ఉన్నా ఆకారంలో మాత్రం పెద్దగా ఉండేవట. మెల్లగా జన్యు మార్పుల వల్ల ఆ ప్రోటో కోళ్లే ఇప్పటి కోళ్ల రూపంలోకి వచ్చేసాయట. అంటే ఆ ప్రోటో కోడి పెట్టిన గుడ్డే ముందు.

ఇప్పటి కోళ్లు పుట్టక ముందే ప్రోటో కోళ్లు పెట్టిన గుడ్లు ఈ ప్రపంచంలోకి వచ్చాయి. అంటే కోడి ముందా? గుడ్డు ముందా? అనే ప్రశ్నకు గుడ్డే ముందు అన్నది సమాధానం అంటూ తన జర్నల్‌లో రాసుకొచ్చాడు రాబర్ట్ క్రుల్విచ్. ఇక అలాంటి ఓ సరదా ప్రశ్నకు సమాధానాన్ని ప్రూవ్ చేసే థీరమ్ ఇన్నాళ్లకు మన ముందుకు తీసుకొచ్చారు రాబర్ట్.

Tags

Next Story