Pakistan : జోధ్​పూర్ యువకుడ్ని వర్చువల్​గా పెళ్లాడిన యువతి..

Pakistan : జోధ్​పూర్ యువకుడ్ని వర్చువల్​గా పెళ్లాడిన యువతి..
భారత వరుడు పాకిస్తానీ వధువు

భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధం బలపడింది. సంబంధం అంటే దౌత్య సంబంధాలు అనుకోకండి. అవి పెళ్లి సంబంధాలు.. ఇప్పటికే సీమా -సచిన్ , అంజు-నస్రుల్లా భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దులను చెరిపేసి తమ ప్రేమను గెలిపించుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు తాజాగా అమీనా-అర్బాజ్ ఖాన్ కూడా ఒక్కటైయ్యారు.అయితే వీరు రిస్క్ లేకుంటే రస్క్ లేదు అనుకోకుండా బుద్ధిగా పెద్దలను ఒప్పించి ఆన్‌లైన్‌లో వివాహం చేసుకున్నారు.

పాకిస్థాన్‌కు చెందిన అమీనాకు భారత్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ అర్బాజ్ ఖాన్‌కు వర్చువల్‌గా వివాహం జరిగింది. వీరిద్దరిదీ పెద్దలు కుదిర్చిన పెళ్లి. పాకిస్థాన్‌లో ఉన్న తమ సోదరుడే ఈ సంబంధాన్ని మాట్లాడి కుదిర్చినట్లు చెప్పాడు వరుడు అర్బాజ్ ఖాన్. నిజానికి ఈ పెళ్లి వ భారత్‌లోనే జరగాలి కానీ అమీనాకు వీసా దొరకకపోవడం వలన ఎవరి దేశాల్లో వారు ఉండిపోయారు అయినా తమ నిఖా సంప్రదాయబద్ధంగా పెద్దల సమక్షంలోనే జరిగినట్లు అర్బాజ్ ఖాన్ తెలిపాడు.


ముస్తాబైన వధూవరులు స్క్రీన్ ముందు కూర్చుని మత పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అనంతరం వారి వారి ప్రాంతాల్లో విందులు చేసుకున్నారు. అర్బాజ్‌, సియాక్ తాత మహ్మద్ అఫ్జల్ వృత్తిరీత్యా కాంట్రాక్టర్ కావడంతో చాలా ఏళ్ల నుంచే పాకిస్థాన్‌కు చెందిన వారితో మంచి పరిచయాలు ఉన్నాయని తెలుస్తోంది.

అమీనాకు వీసా వచ్చిన తర్వాత ఇండియాలో మరోసారి ఘనంగా వివాహన్ని సెలెబ్రేట్ చేసుకుంటానని చెప్పారు అర్బాజ్. వీసా రాగానే భారత్ వచ్చేందుకు వధువు .. కొత్త కోడలి కోసం అర్బాజ్‌ కుటుంబ సభ్యులు, స్థానికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags

Next Story