Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో హింసపై ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి

బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంటున్న హింస పట్ల యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెర్రస్ ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ వ్యక్తిని కొట్టి చంపిన ఘటన పట్ల ఆయన రియాక్ట్ అయ్యారు. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న హింసాత్మక ఘటనలు ఆందోళన కలిగిస్తున్న విషయం వాస్తవమే అని యూఎన్ సెక్రటరీ జనరల్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ తెలిపారు. ప్రెస్ మీట్‌లో ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయన్న అంశంపై స్పందన కోరగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ అయినా మరే ఇతర దేశమైనా, మెజార్టీకి చెందని ప్రజలు సురక్షితంగా ఉండాలని, బంగ్లాదేశీయులందరూ సేఫ్‌గా ఉండాలని, దేశంలోని ప్రతి పౌరుడు సురక్షితంగా ఉండేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని విశ్వాసంతో ఉన్నట్లు డుజారిక్ తెలిపారు.
బంగ్లాదేశ్‌లోని అనేక మీడియా సంస్థలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మీడియా సంస్థలను టార్గెట్ చేయడంలో తమ జీవన హక్కు ప్రమాదంలో పడినట్లు బంగ్లా జర్నలిస్టులు ఆరోపించారు. బంగ్లా మీడియా ప్రస్తుతం దీన అవస్థలో ఉన్నదని, భావస్వేచ్ఛను హరించారని జర్నలిస్టులు పేర్కొన్నారు. ఢాకాలో ఉన్న ప్రోతమ్ ఆలో, ద డెయిలీ స్టార్ వార్తాపత్రికల ఆఫీసులకు నిప్పు పెట్టిన ఘటన నేపథ్యంలో పలువురు ఎడిటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఆఫీసులకు నిప్పుపెట్టిన సమయంలో చాలా మంది జర్నలిస్టులు లోపలే చిక్కుకుపోయారని, పోలీసులు.. ఫైర్ సర్వీసులను రాకుండా అడ్డుకున్నారని ఎడిటర్లు ఆరోపించారు. భావస్వేచ్ఛ ఇప్పుడో సమస్య కాదు అని, అసలు బ్రతికి ఉండడమే ఇప్పుడు సమస్యగా మారినట్లు డెయిలీ స్టార్ ఎడిటర్ మహఫూజ్ ఆనమ్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

