Biden Apologise: మాజీ అధ్యక్షుడు ట్రంప్ చేసిన పనికి బైడెన్ క్షమాపణ..

Biden: అధికారంలోకి వచ్చిన వారు తమకు తోచినట్టుగా, తమ అనుచరుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. అదే మాదిరిగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్యారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి తొలగారు. ఇలా చేయడం సముచితం కాదని భావించిన ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ప్యారిస్ ఒప్పందంలో చేరుతున్నట్లు ప్రకటించారు.
ఐక్యరాజ్య సమితి కాప్ 27 సదస్సులో ప్రసంగించిన ఆయన ప్రపంచ దేశాలను క్షమాపణలు కోరారు. భూతాపాన్ని తగ్గించే అంశంలో నాయకత్వాన్ని తిరిగి తీసుకునేందుకు అమెరికా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
ఈ ఒక్క సమస్యపై దశాబ్ధాలుగా చర్చ జరుగుతోంది. దేశం పురోగతి సాధించాలని, అడ్డంకులను అధిగమించాలనే తాను అధ్యక్ష పదవి చేపట్టినట్లు పేర్కొన్నారు. 2023 నాటికి శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలనే లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు.
ప్రపంచ దేశాలు సైతం శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని కోరారు. గ్లోబల్ లీడర్‌గా వారిపై ఒత్తిడి తేవడం తమ బాధ్యత అని ఆయన అన్నారు. పర్యావరణ సంక్షోభంతో అది జాతీయ భద్రతకు ముప్పు తెస్తోందని సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com