Apple: యాపిల్ ఉద్యోగి.. ఆఫీసుకు రమ్మనడంతో..

Apple: యాపిల్ ఉద్యోగి.. ఆఫీసుకు రమ్మనడంతో..
Apple: కరోనా వచ్చి ఇంటి నుంచి పని చేయడం మొదలు పెట్టారు చాలా మంది ఉద్యోగులు.

Apple: కరోనా వచ్చి ఇంటి నుంచి పని చేయడం మొదలు పెట్టారు చాలా మంది ఉద్యోగులు. అంతకు ముందు అప్పుడప్పుడు చేసే పని ఇప్పుడు దాన్నే పర్మినెంట్ చేస్తే బావుండని ఫీలవుతున్నారు వర్క్ ఫ్రమ్ హోం చేసే ఉద్యోగులు.. ఆఫీసుకు రమ్మంటే చాలు.. రాము పొమ్మని చెప్పేవాళ్లు కొందరైతే, రిజైన్ చేసే వాళ్లు మరికొందరు.. ఈ ట్రాఫిక్ లో అంత దూరం వచ్చి చేయడం కంటే ఇంట్లో వున్నా ప్రొడక్టివ్ వర్క్ ఇస్తున్నాం కదా అని బాస్ తో ఆర్గ్యూ చేస్తున్నారు. తాజాగా యాపిల్ యొక్క మెషిన్ లెర్నింగ్ డైరెక్టర్ ఇయాన్ ని ఆఫీసుకు రమ్మనందుకు ఇష్టం లేని కారణంగా రిజైన్ చేశారు.

కంపెనీని విడిచిపెట్టాలనే ఇయాన్ నిర్ణయం Apple యొక్క హైబ్రిడ్ వర్క్ పాలసీ ద్వారా ప్రభావితమైంది. కొత్త వర్క్ పాలసీ ప్రకారం ఉద్యోగులు ఏప్రిల్ 11 నాటికి వారానికి కనీసం ఒక రోజు, మే 2 నాటికి వారానికి కనీసం రెండు రోజులు మరియు మే 23 నాటికి వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసు నుండి పని చేయాల్సి ఉంటుంది. Apple తన ఉద్యోగులను తిరిగి రావాలని కోరింది. మే 23 నుండి వారానికి కనీసం మూడు రోజులు. అయితే, కొంతమంది ఉద్యోగులు Apple యొక్క కొత్త చర్యతో సంతోషంగా లేరు.

యాపిల్ ఉద్యోగులు ఆపిల్ సీఈవో టిమ్ కుక్‌కు లేఖ రాస్తూ తిరిగి ఆఫీసుకు రావడం వల్ల కలిగే నష్టాలను ఉటంకించారు. కుక్‌కి పంపిన ఇమెయిల్‌లో, ఉద్యోగులు ఇలా రాసుకొచ్చారు.. ఇంటి నుంచి పని చేయడం వల్ల మా కుటుంబాలతో ఎక్కువసేపు గడపడానికి వీలవుతుంది. ఇంట్లో వాళ్ల బాగోగులు చూసుకుంటూనే ఆఫీస్ పని చేస్తున్నాం. నిజానికి ఆఫీసుకు వచ్చి చేస్తున్న వర్క్ కంటే ఎక్కువే చేస్తున్నాం అని పేర్కొన్నారు.. మీ నిర్ణయం మాకు సంతోషంగా లేదు అని మెయిల్ లో తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story