మహిళ ప్రాణాలను కాపాడిన యాపిల్ వాచ్.. నిద్ర లేపి మరీ.. .

మహిళ ప్రాణాలను కాపాడిన యాపిల్ వాచ్.. నిద్ర లేపి మరీ..    .
యాపిల్ ఫోన్ చాలా ఖరీదైనది. యాపిల్ వాచ్ కూడా అంతకంటే ఎక్కువే మరి.

యాపిల్ ఫోన్ చాలా ఖరీదైనది. యాపిల్ వాచ్ కూడా అంతకంటే ఎక్కువే మరి.. అయితేనేం పోయే ప్రాణాలను కాపాడుతుంది.. ఆరోగ్య హెచ్చరికలు చేసి వారి ఆయుష్షును పెంచుతుంది. ఓ మహిళకు ప్రమాదకరమైన రక్తం గడ్డకట్టడం గురించి హెచ్చరించడం ద్వారా ఆమెను రక్షించింది.USAలోని సిన్సినాటి నివాసి అయిన కిమ్మీ వాట్కిన్స్ అనే మహిళ అనారోగ్యంగా ఉంది. మైకం, తలతిరగడం కారణంగా నిద్రపోవాలని నిర్ణయించుకుంది.

అయితే ఆమె నిద్రపోయిన కొద్దిసేపటికే ఆమె ఆపిల్ వాచ్ ఆమె గుండే వేగంగా కొట్టుకోవడాన్ని గమనించింది. నిమిషానికి 178 బీట్స్ గురించి ఆమెను హెచ్చరించింది.తన యాపిల్ వాచ్ అలారం మోగించిందని " హృదయ స్పందన చాలా కాలం నుండి చాలా ఎక్కువగా ఉందని చెప్పింది". "కాబట్టి 10 నిమిషాలకు పైగా, ఇది చాలా ఎక్కువగా ఉంది." ఆందోళనతో, ఆమె తన వైద్యుడి వద్దకు వెళ్లింది, ఆమెకు సాడిల్ పల్మనరీ ఎంబోలిజం ఉందని-ఊపిరితిత్తులలో ప్రాణాంతకమైన రక్తం గడ్డకట్టిందని వైద్యులు ఆమెకు వివరించారు. వీలైపంత త్వరగా వైద్యం అందించాల్సి ఉంటుందని ఆమెకు తెలిపారు.

ఆపిల్ వాచ్ ఆమె హృదయ స్పందన రేటు గురించి ఆమెను హెచ్చరించకపోతే, ఆమె సమస్యను చాలా తేలికగా తీసుకునేది.. మరణానికి చేరువయ్యేది అని వైద్యులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story