Putin: పుతిన్ కు భంగపాటు..
రష్యా అధ్యక్షుడు పుతిన్ కు పరాభవం ఎదురయింది. ఆయన ప్రసంగం మొదలుపెట్టగానే ఐరోపా ప్రతినిధులు వాకౌట్ చేశారు. చైనా రాజధాని బీజింగ్‌లో ఈ సంఘటన శిఖరాగ్ర సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బిలియన్ డాలర్ల బెల్ట్, రోడ్ ప్రాజెక్టు కోసం ఈ అతిపెద్ద దౌత్య కార్యక్రమాన్ని నిర్వహించారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అధ్యక్షతన బీజింగ్ లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్స్ లో ఈ కార్యక్రమం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా వెయ్యికి పైగా ప్రతినిధులు ఈ సమ్మిట్ కు హాజరయ్యారు.
ఉక్రెయిన్ తో యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ కు ఇదే తొలి విదేశీ పర్యటన. తనతో పాటు అణ్వాయుధాల ప్రయోగానికి సంబంధించిన బ్రీఫ్ కేస్ ను కూడా పుతిన్ తీసుకెళ్లారు. జిన్ పింగ్ మాట్లాడిన తర్వాత పుతిన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆయన ప్రసంగాన్ని మొదలు పెట్టగానే ఐరోపా ప్రతినిధులు వాకౌట్ చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు నిరసనగా శిఖరాగ్ర సమావేశం హాల్ నుంచి బయటకు వెళ్లిపోయారు.
చైనా- రష్యా మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సుదీర్ఘకాలంగా ఈ రెండు దేశాలు మిత్రత్వాన్ని కొనసాగిస్తూ వస్తోన్నాయి. పుతిన్‌కు చైనా అధ్యక్షుడు గ్ఝి జిన్‌పింగ్‌ను ఆప్తమిత్రుడిగా అభివర్ణిస్తుంటారు. ఆర్థిక కార్యకలాపాలు, ఆయుధాల కొనుగోళ్లు, మిలటరీ ఆపరేషన్స్, ఎగ్జిమ్.. వంటి రంగాల్లో ఈ రెండు దేశాల మధ్య ఎన్నో ద్వైపాక్షిక ఒప్పందాలు ఉన్నాయి.
ఈ సమావేశానికి భారత్ దూరంగా ఉండాలని నిర్ణయించింది. 2017, 2019లో కూడా బీఆర్‌ఐ సదస్సుకు ఇండియా దూరంగా ఉన్నది ఈ ప్రాజెక్టులో భాగంగా 6 వేల కోట్ల డాలర్ల వ్యయంతో చేపట్టిన చైనా-పాక్ ఎకనమిక్ కారిడార్ (సీపెక్) ప్రాజెక్టు పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా సాగడాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తుండటమే దీనికి కారణం. కాగా, యుద్ధ నేరాల కేసులో పుతిన్‌ను అంతర్జాతీయ కోర్టు దోషిగా నిర్ధారించింది. రష్యా అధినేత అరెస్టుకు గత మార్చిలో ఆదేశాలు జారీచేసింది. దీంతో పుతిన్ గత కొన్ని రోజులు విదేశీ పర్యటనలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. గత నెలలో భారత్ వేదికగా జరిగిన జీ20 సమావేశాలకు కూడా హాజరుకాలేదు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com