Asim Munir: షహబాజ్ షరీఫ్‌కు ఆసిమ్ మునీర్ చెక్..

పాకిస్తాన్‌లో రాజకీయ అస్థిరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా, ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ యాక్టివ్‌గా మారారు. పౌర ప్రభుత్వాన్ని కాదని ఆయనే అన్ని దేశాల పర్యటకు వెళ్తున్నారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అసలు నిజమైన పాలకుడా..? కాదా..? అనే సందేహాలు వస్తున్నాయి. ఇటీవల, షరీఫ్‌ని పక్కన పెట్టేందుకు మునీర్ ప్రయత్నిస్తు్న్నాడనే వాదనలు కూడా ఊపందుకున్నాయి. ఇదే జరిగితే, మరోసారి పాకిస్తాన్ సైనిక ప్రభుత్వ కిందకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ దేశంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా పరిగణించబడుతున్నారు. సాధారణంగా ఇతర దేశాలతో సంబంధాల విషయంలో ప్రధాని నేతృత్వంలోని బృందం చర్చల్ని నిర్వహిస్తుంది. కానీ, పాకిస్తాన్‌లో మాత్రం ఆసిమ్ మునీర్ పలు దేశాల పర్యటనలకు వెళ్లడం, ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించడం జరుగుతోంది.
ఇటీవల, ఆసిమ్ మునీర్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. రెండు దేశాల సంబంధాలపై చర్చించారు. తాజాగా ఆయన శ్రీలంక, ఇండోనేషియా దేశాల్లో పర్యటనలు ఖరారయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశమైన ఇండోనేషియాతో ద్వైపాక్షిక సంబంధాలు పెంచుకునే దిశగా సమావేశాలు జరుపుతున్నారు. ఇదంతా చూస్తే ప్రధాని షహజాబ్ షరీఫ్‌ని సైడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మునీర్ జూలై 21న కొలంబోకు వెళ్లనున్నారు.
షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్య
పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీని బలవంతంగా గద్దెదించి దేశ సైనిక దళాల ప్రధానాధికారి అసిం మునీర్ ఆ స్థానాన్ని ఆక్రమించనున్నారంటూ వినవస్తున్న వార్తలు వదంతులు మాత్రమేనని ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ స్పష్టంచేశారు. ‘‘ఫీల్డ్ మార్షల్ అసిం మునీర్ దేశాధ్యక్షుడు కావాలన్న ఆకాంక్షను ఏనాడూ వ్యక్తీకరించలేదు. ఆయనను అలా చేయాలన్న ఆలోచనా లేదు’’ అని షరీఫ్ ఒక వార్తాసంస్థకు తెలియజేశారు. జర్దారీకీ, మునీర్‌కీ, తనకూ మధ్య పరస్పర గౌరవం, పాకిస్థాన్ ప్రగతి సాధించాలన్న ఏకైక లక్ష్యంతో కూడుకున్న బలమైన అనుబంధం ఉన్నాయని షరీఫ్ అన్నారు. జర్దారీ, షరీఫ్, మునీర్‌లపై ‘‘దురుద్దేశ పూరిత ప్రచారం’’ జరుగుతోందంటూ పాకిస్థాన్ అంతరంగిక మంత్రి మొహ్సిన్ నక్వీ సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రకటన నేపథ్యంలో ప్రధాని ప్రకటన వెలువడింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com