Rocket Attack On Israel: ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా రాకెట్ దాడి

ఇజ్రాయెల్ నియంత్రణలోని గోలన్ హైట్స్‌లోని ఓ సాకర్ మైదానంలో జరిగిన రాకెట్ దాడిలో 12మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో చిన్నారులు, టీనేజీ బాలబాలికలు ఉన్నట్లు తెలుస్తోంది. దీని వెనక లెబనాన్‌కు చెందిన మిలిటెంట్ గ్రూప్ హెజ్‌బొల్లా హస్తం ఉందని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఇది ఒక తీవ్రమైన ఘటనగా పేర్కొంది. తదనుగుణంగా చర్య తీసుకుంటామని తెలిపింది. అయితే ఈ దాడికి తాము కారణమని ఇజ్రాయెల్ చేస్తున్న ఆరోపణలను హెజ్‌బొల్లా ఖండించింది. తమకీ ఘటనతో సంబంధం లేదని పేర్కొంది. ఈ చిన్నారులపై హెజ్‌బొల్లా రాకెట్‌ను ప్రయోగించిందని ఇజ్రాయెల్ మిలిటరీ ప్రధాన ప్రతినిధి డేనియల్ హగారి ఆరోపించారు. ఈ విషయంలో హెజ్‌బొల్లా అబద్ధం చెబుతోందని ఆయన అన్నారు. గాజాలో యుద్ధానికి దారితీసిన అక్టోబర్ 7న హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ పౌరులపై జరిగిన అత్యంత ఘోరమైన దాడి అని డేనియల్ పేర్కొన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com