Thailand: షాకింగ్.. ప్రీ స్కూల్లో కాల్పులు.. 32 మంది చిన్నారులు మృతి

Thailand: అభం శుభం తెలియని 32 మంది చిన్నారులను అన్యాయంగా చంపేశాడు ఓ దుర్మార్గుడు. థాయిలాండ్‌లోని ప్రీ స్కూల్లో ఈ ఘోరం చోటు చేసుకుంది. ఓ దుండగుడు చిన్నారుల డే కేర్ సెంటర్‌లోకి చొరబడి కాల్పులకు తెగబడ్డాడు. ఇప్పటి వరకు ఈ ఘటనలో 32 మంది చిన్నారులు మృతి చెందినట్లు స్థానిక మీడియా పేర్కొంది. మృతుల్లో అత్యధికమంది చిన్నారులే.
ఈ ఘటన దేశంలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న నాక్లాంగ్ జిల్లాలోని నాంగ్‌బు నాలంఫూ ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది. కాల్పులకు పాల్పడిన దుండగుడు 34 ఏళ్ల పాన్య ఖమ్రావ్‌గా అనుమానిస్తున్నారు. గతంలో అతడు పోలీసు అధికారిగా విధులు నిర్వహించేవాడు. కానీ మాదక ద్రవ్యాలు వాడినట్లు తేలడంతో అతడిని విధుల నుంచి తొలగించారు. కాల్పులకు పాల్పడిన అనంతరం పారిపోయాడు.
"షూటర్ లంచ్ సమయంలో వచ్చి మొదట పిల్లల సంరక్షణ కేంద్రంలో ఉన్న ఐదుగురు అధికారులను కాల్చిచంపాడు". తుపాకీ సౌండ్ విని "మొదట ప్రజలు బాణసంచా అని భావించారు. కానీ విషయం తెలుసుకుని భీతావహులయ్యారు.
థాయ్‌లాండ్ ప్రధాని ప్రయుత్ చాన్-ఓచా కాల్పులను "షాకింగ్ ఈవెంట్"గా అభివర్ణించారు. అంబులెన్స్‌లు, పోలీసు వాహనాల దగ్గర కుటుంబాలు గుమిగూడిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చాలామంది దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. థాయ్‌లాండ్‌లో సామూహిక కాల్పులు జరగడం చాలా అరుదు.
2021లో నఖోన్ రాట్చసిమాలో ఒక సైనికుడు 21 మందిని కాల్చి చంపాడు. ఆ దుర్ఘటనలో డజన్ల కొద్దీ గాయపడ్డారు. 2020లో అత్యంత ఘోరమైన సంఘటన ఒకటి జరిగింది. ఒక సైనికుడు 17 గంటలు విధ్వంసాన్ని సృష్టించి 29 మందిని కాల్చి చంపేశాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com