Chile Forest Fires: చిలీలో కార్చిచ్చు..

అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో చిలీలో చెలరేగిన కార్చిచ్చు ఆగడం లేదు.. ఈ కార్చిచ్చు కారణంగా ఇప్పటికే 115 మందిమంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. సుమారు 1600 ఇండ్లు దగ్ధమయ్యాయని అధికారులు తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరణాల సంఖ్య, దగ్ధమైన ఇండ్ల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్ తెలిపారు.
వారం రోజులుగా ఉష్ణోగ్రతలు అసాధారణ రీతిలో పెరిగిపోయాయని చిలీ అంతర్గత వ్యవహారాల మంత్రి కరోలినా తోహా చెప్పారు. వాల్పారాయిసో ప్రాంత అడవుల్లో ప్రాణాంతక కార్చిచ్చు రగులుతున్నది. అయితే ప్రజలను తమ ఇండ్లలోనే ఉండాలని, అంబులెన్సులు, ఫైరింజన్లు, ఇతర ఎమర్జెన్సీ వాహనాల ద్వారా వారిని తరలిస్తామని చెప్పారు. కానీ ఎంత మంది మరణించారన్న సంగతి మాత్రం తోహా వెల్లడించలేదు.
శుక్రవారం నుంచి మొదలైన కార్చిచ్చు వల్ల క్విల్పౌ, విల్లా అలెమనా పట్టణాలకు సమీపంలోని అడవుల్లో కార్చిచ్చు రగులుకున్నదని తోహా చెప్పారు. అగ్ని కీలల వల్ల కోస్టల్ రిసార్ట్ టౌన్ వినా డీల్ మార్ చుట్టుపక్కల ఇండ్లు దెబ్బ తిన్నాయి. విల్లా ఇండెపెండెన్సియా ప్రాంతంలోని పలు బ్లాకుల్లో గల ఇండ్లు, దుకాణాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కార్లు పేలిపోవడంతోపాటు పగిలిన విండోలతో వీధుల్లో పడిపోయాయి.
తీర ప్రాంత పర్యాటక పట్టణం వినాడెల్ మార్, దారి చుట్టుప్రక్కల ప్రాంతాలు ప్రభావితమైనట్లు చిలీ అధికారులు తెలిపారు. మంటల ప్రభావిత ప్రాంతాలకు చేరుకునేందుకు రెస్క్యూ టీంలు నానా తంటాలు పడుతున్నాయి. రెస్క్యూ సిబ్బందికి సహకరించాలని బోరిక్ చిలీ ప్రజలను కోరారు. పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని ఆయన అభిప్రాయ పడ్డాడు. మంటలను అదుపు చేసేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలించడం లేదని తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు, బలమైన గాలులు, స్వల్ప తేమ.. పరిస్థితులను మరింత దయనీయంగా మారుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మంటలు తీవ్రత అధికంగాఉన్న పలు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.
చిలీలో సంభవించిన అత్యంత ఘోరమైన కార్చిచ్చుల్లో ఇదొకటని స్థానికులు, అధికారులు చెబుతున్నారు.ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారిలో చాలామంది వేసవి నుంచి ఉపశమనం పొందేందుకు తీర ప్రాంతానికి వచ్చినవారే ఎక్కువగా ఉన్నారు.అత్యవసర వైద్య సేవలు తప్ప మిగిలిన వాటిని ప్రస్తుతానికి నిలిపేయాలని, ఫీల్డ్ హాస్పిటల్స్‌ను ఏర్పాటు చేయాలని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తమ సిబ్బందిని ఆదేశించింది.,ఆరోగ్య సర్వీసులపై ఒత్తిడి తగ్గించేందుకు మెడిసిన్ విద్యార్ధుల సేవలను వినియోగించుకోవాలని ఆ ఆదేశాలలో పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com