అఫ్గాన్‌లో అల్లకల్లోలం.. విమానం నుంచి జారిబడుతున్న జనం

విమానంలో నుంచి జారిపడుతున్న జనం. తాలిబన్ల ఆక్రమణతో తలో దిక్కుకు పరిగెడుతున్న జనం. ఎక్కడికి వెళుతున్నారో.. ఎలా బతుకుతారో తెలియదు. ముందు అక్కడి నుంచి బయట పడితే ప్రాణాలన్నా నిలుస్తాయన్న తలంపుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విమానంలో జనం తోసుకుంటూ ఎక్కుతున్నారు. మరో మార్గం లేక రెక్కలపైన కూడా కూర్చున్నారు. విమానం గాల్లోకి ఎగరడంతో అంత ఎత్తు మీద నుంచి క్రింద పడతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అఫ్గనిస్థాన్ రాజధాని నగరం కాబూల్‌ను తాలిబన్ల ఆక్రమించుకోవడంతో వేలాది మంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని విదేశాలకు పారిపోతున్నారు. ఆదివారం నుంచి కాబూల్ విమానాశ్రయం కిక్కిరిసిపోయింది. దేశంలో లాక్‌డౌన్ ప్రకటించగానే రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు కిక్కిరిసిపోవడం.. వాహనాలు ఎక్కేందుకు ప్రజలు ఎగబడినట్టు ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయ పరిస్థితి అలానే ఉంది. వేలాది మంది ప్రజలు దేశం వీడేందుకు ఏకంగా విమానాల వద్దకే పరుగులు పెడుతున్నారు. ప్రయాణికులను అదుపుచేయడానికి కాల్పులు జరపడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com