Fire Accident: గేటుకు తాళమే ఎక్కువమంది ప్రాణాలు తీసిందా?

దక్షిణాఫ్రికా(South Africa)లోని జొహన్నెస్‌బర్గ్ (Johannesburg)లో ఓ ఐదంతస్తుల అంతస్తు భవనం(five-story building)లో జరిగిన ఘోర అగ్ని ప్రమాద ఘటన(fire ripped)లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకూ ఈ ప్రమాదంలో 74 మంది సజీవ దహనమయ్యారని(At least 74 dead)....మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉన్నట్లు( Seven of the victims were children) అధికారులు వెల్లడించారు. మరో 52 మంది గాయపడగా( 52 people) వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. వీరంతా కాలిన గాయాలతో పాటు శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ట్లు వైద్యులు తెలిపారు.
ఘటన సమయంలో భవనంలో దాదాపు 200 మంది ఉన్నట్లు(200 people ) తెలుస్తోంది. అనేక మంది ఆచూకీ తెలియక పోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు అనుమానిస్తున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత అంతా నిద్రలో ఉన్నపుడు ప్రమాదం జరిగినందున ప్రాణనష్టం ఎక్కువగా ఉందని అధికారులు వివరించారు. ప్రమాద మృతుల్లో ఎక్కువ మంది టాంజానియా వాసులేనని తెలుస్తోంది.
ఆ భవనంలో ఉన్నవారంతా శరణార్థులేనని(migrants) అధికారులు తెలిపారు. జొహన్నెస్‌బర్గ్ (Johannesburg)లోని చాలా ప్రాంతాల్లో అనేక భవనాలను చాలా ఏళ్లుగా ఉపయోగించడం లేదని అధికారులు తెలిపారు. ఇందులో చాలావరకు క్రిమినల్ సిండికేట్ల ఆక్రమించుకుని.. విదేశాల నుంచి వచ్చిన శరణార్థులకు అద్దెకు ఇస్తున్నారని ప్రాథమికంగా నిర్థారించారు. ప్రమాదం జరిగిన భవనంలో సెక్యూరిటీ గేట్‌కు తాళం వేసి ఉంది. దీంతో మంటలు చెలరేగిన సమయంలో అందులో చిక్కుకున్న వారంతా వెంటనే బయటకు రాలేకపోయారని అధికారులు తెలిపారు. సహాయక చర్యల సమయంలో ఆ గేట్‌ను బద్దలుకొట్టగా.. దాని వెనుక అనేక కాలిన మృతదేహాలు కన్పించడం ఈ విషాదాన్ని అద్దం పడుతోంది.
మంటల్ని అదుపులోకి తెచ్చిన అధికారులు.. భవనంలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో మరిన్ని మృతదేహాలు బయటకు వస్తున్నాయని తెలిపారాయన. మరోవైపు బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా మారుమోగుతోంది.
శరణార్థులు( more victims) భవనాల్లో కొవ్వత్తుల వెలుతురులో, చిన్న చిన్న పారాఫిన్ స్టవ్‌లపై వంట చేసుకుంటూ నివాసముంటున్నారు. కొందరైతే కట్టెల పొయ్యిలు కూడా ఉపయోగిస్తున్నారు. అన్ని వైపులా మూసి ఉండే ఇలాంటి భవనాల్లో పొయ్యిలు వినియోగించడం ప్రమాదకరం కాగా. తాజా అగ్నిప్రమాదం కూడా దానివల్లే జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com