ఆర్థికసాయం పంపిణీలో అపశృతి.. 80 మందికి పైగా మృతి

ఆర్థికసాయం పంపిణీలో అపశృతి.. 80 మందికి పైగా మృతి
రంజాన్‌ అన్నదాన కార్యక్రమంలో సాయం అందుతుందన్న ఆశతో వందలాది మంది ఒకేసారి ఆ ప్రాంగణానికి చేరుకోవడంతో విషాదం చోటుచేసుకుంది.

పేదరికంలో మగ్గుతున్న వారు ఏదైనా సాయం అందుతుందేమో అని ఆశగా ఎదురు చూస్తున్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఛారిటీ సంస్థ సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. ప్రకటన వెలువడిన మరుక్షణంలోనే పాఠశాల ప్రాంగణానికి వందలాది మంది చేరుకున్నారు. వారిని నియంత్రించడం ఎవరి తరం కాలేదు.. దీంతో తొక్కిసలాట జరిగింది. భారీ ప్రమాదం చోటు చేసుకుంది. సాయం అందుతుందన్న ఆశతో వందలాది మంది ఒకేసారి ఆ ప్రాంగణానికి చేరుకోవడంతో విషాదం చోటుచేసుకుంది.

యుద్ధంలో దెబ్బతిన్న యెమెన్‌లో గురువారం జరిగిన ఒక ఛారిటీ పంపిణీ కార్యక్రమంలో 80 మందికి పైగా మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. హుతీ అధికారులు మాట్లాడుతూ, ఇది ఈదశాబ్దంలో జరిగిన ఘోర ప్రమాదంగా అభివర్ణించారు. అరేబియా ద్వీపకల్పంలోని అత్యంత పేద దేశంలో చోటు చేసుకున్న విషాదం ఇది. రాజధానిలోని బాబ్ అల్-యెమెన్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు.

యెమెన్‌లో ఎనిమిదేళ్లకు పైగా జరిగిన అంతర్యుద్ధం ప్రపంచంలోని అత్యంత ఘోరమైన విషాదాలలో ఒకటిగా ఐక్యరాజ్యసమితి పేర్కొంది. 2014లో ఇరాన్-మద్దతుగల హుతీ తిరుగుబాటుదారులు సనాను స్వాధీనం చేసుకోవడంతో వివాదం ప్రారంభమైంది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి సౌదీ జోక్యం చేసుకోవలసి వచ్చింది. UN ప్రకారం, జనాభాలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మంది దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్నారు. హుతీ-నియంత్రిత ప్రాంతాల్లోని ప్రభుత్వ ఉద్యోగులతో సహా, సంవత్సరాలుగా వేతనాలు చెల్లించబడలేదు. దేశంలో మూడింట రెండొంతుల మందికి సహాయం కావాలని UN నివేదించింది.

Tags

Read MoreRead Less
Next Story