Central Gaza : ఇజ్రాయెల్ దాడిలో 94 మంది మృతి
సెంట్రల్ గాజాలోని నుస్రత్ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడికి పాల్పడింది. ఈ దాడిలో 94 మంది పాలస్తీనియన్లు మరణించారు.. 200 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని అల్-అక్సా ఆసుపత్రికి తీసుకువచ్చారు. అల్-అక్సా హాస్పిటల్ నిరంతర కార్యకలాపాలను నిర్వహించడానికి, వైద్య అవసరాలు, జనరేటర్లను సరఫరా చేయాలని అంతర్జాతీయ సంస్థలకు ఎమర్జెన్సీ రిక్వె్స్ట్ చేశారు. అల్-అక్సా హాస్పిటల్ ఇజ్రాయెల్ బాంబు దాడి కారణంగా మరణించిన, గాయపడిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశాం ఉంది.
అంతకుముందు రోజు, అల్-అక్సా ఆసుపత్రి ప్రతినిధి ఖలీల్ అల్-దక్రాన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నుస్రత్ శిబిరంపై ఇజ్రాయెల్ దాడి ఫలితంగా 55 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఆసుపత్రి కిక్కిరిసిపోయి రోగులకు ఆస్కారం లేదని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ఫిరంగిదళాలు, యుద్ధ విమానాలు దీర్ అల్-బలాహ్, అల్-బురిజ్, అల్-మఘాజీ శిబిరాలకు తూర్పున ఉన్న ప్రాంతాలతో పాటు, నుస్రాత్ శిబిరం మధ్యలో, పశ్చిమం, తూర్పున ఉన్న వివిధ ప్రదేశాలపై గంటల తరబడి బాంబు దాడి చేస్తున్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఫిరంగి బాంబు దాడుల కారణంగా సెంట్రల్ గాజా స్ట్రిప్‌లోని అన్ని ప్రాంతాల నుండి నల్లటి పొగలు ఎగసిపడుతున్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఇజ్రాయెల్ సైనిక వాహనాలు అకస్మాత్తుగా నుస్రత్ శిబిరానికి తూర్పు , వాయువ్య ప్రాంతాలలోకి ప్రవేశించి, శిబిరంలోని పెద్ద భాగాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇజ్రాయెల్ డ్రోన్లు నుస్రత్ క్యాంప్ మీదుగా ఎగురుతున్నాయి. శిబిరం వీధుల్లో నడుస్తున్న వారిపై వారు కాల్పులు జరుపుతున్నారు. ఫలితంగా అనేక మంది చనిపోగా చాలామందికి గాయాలవుతున్నాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడులు, షెల్లింగ్ కారణంగా డజన్ల కొద్దీ ప్రజలు సెంట్రల్ సిటీ డెయిర్ అల్-బలాలోని అల్-అక్సా అమరవీరుల ఆసుపత్రికి చేరుకున్నారు. డెయిర్ అల్-బలాహ్ తూర్పు భాగంలో, అల్-బురిజ్, అల్-మఘాజీ శిబిరాల్లో.. సెంట్రల్ గాజా స్ట్రిప్‌లోని నుస్రాత్ శిబిరానికి ఉత్తరాన పాలస్తీనా ప్రతిఘటన గ్రూపులు, ఇజ్రాయెల్ దళాల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com