Tourist Boat : పర్యాటకులతో వెళ్తున్న పడవ బోల్తా.. నలుగురు మృతి,
ఇండోనేషియాలోని బాలిలో పర్యాటకులతో వెళ్తున్న పడవ నీటమునింది. దీంతో నలుగురు మరణించగా, 61 మంది గల్లంతయ్యారు. 53 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో జావా నుంచి బాలి వెళ్తున్న పడవ బుధవారం రాత్రి 11.20 గంటలకు ప్రమాదానికి గురై నీట మునిగింది. దీంతో అందులో ఉన్న 65 మంది గల్లంతయ్యారు. అయితే వారిలో నలుగురు మరణించగా, ఇప్పటివరకు 23 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. మరో 38 మంది ఆచూకీ లభించలేదని, వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
పడవలో 14 ట్రక్కులుసహా 22 వాహనాలు ఉన్నాయని తెలిపారు. దాదాపు 17 వేల దీవులతో కూడిన ద్వీపసమూహం అయిన ఇండోనేషియాలో భద్రతా ప్రమాదాలు లోపించడంతో నిత్యం సముద్ర ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈఏడాది మార్చిలో బాలి తీరంలో 16 మందితో ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ ఆస్ట్రేలియన్ మహిళ మరణించింది. 2018లో సుమత్రా ద్వీపంలో పడవ నీటమునగడంతో ప్రమాదంలో 150 మంది నీటమునిగారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com