పాకిస్థాన్‌లో దారుణం

పాకిస్థాన్‌లో దారుణం
X

పాకిస్థాన్‌లోని పెషావర్‌ నగరంలో దారుణం చోటు చేసుకుంది. డైరెక్టర్‌ కాలనీలోని మదరసాలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించగా.. మరో 70 పిల్లలు మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన పిల్లలను సమీపంలోని లేడీ రీడింగ్ హాస్పిటల్‌కు తరలించారు. 20మంది క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని పాక్ వైద్యులు చెప్పారు. పేలుడు ఘటనా స్థలానికి ప్రత్యేక పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియలేదని... తాము దర్యాప్తు చేస్తున్నామని పాక్ పోలీసులు చెప్పారు.

Tags

Next Story