పందెంలో ఓడి.. ప్రజల హృదయాల్లో గెలిచి..

పందెంలో ఓడి.. ప్రజల హృదయాల్లో గెలిచి..
అప్పటి వరకు డియాగో కంటే ముందున్న జేమ్స్ ట్రాక్ తప్పాడు.. గెలుపుకు సెకన్ల తేడా..

అప్పటి వరకు తన ప్రత్యర్ధిని ఓడించాలనే కసితో పరుగుపెడుతున్నాడు.. కానీ అతడిని దాటలేకపోతున్నాడు.. అయినా ప్రయత్నాన్ని విడువలేదు.. అంతలోనే ముందున్న తన ప్రత్యర్ధి తడ బడిన అడుగులతో ఓ సెకన్ దారి తప్పాడు.. ఆ విషయం గమనించి అప్పటి వరకు తనని ఓడించాలనుకున్నవాడు కాస్తా ఆగిపోయాడు ప్రత్యర్థి గెలవడమే కరెక్ట్ అనుకున్నాడు.. నిజమైన గెలుపు తనదే అని భావించాడు.. అతడినే విజేతను చేశాడు.. తను చేసిన మంచి పనితో లక్షలాది మంది ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నాడు డియాగో మెంట్రిగా. అతడి క్రీడా స్ఫూర్తికి జనం జేజేలు పలుకుతున్నారు. సామాజిక మాధ్యమాలు డియాగోపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నాయి.

స్పెయిన్‌‌లోని బార్సిలోనాలో ట్రయథ్లాన్ (పరుగుపందెం) నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో స్పెయిన్‌కు చెందిన క్రీడాకారుడు డియాగో మెట్రిగో, బ్రిటీష్ అథ్లెట్ జేమ్స్ ముందు వరుసలో నిలిచి పోటీపడుతున్నారు. అప్పటి వరకు డియాగో కంటే ముందున్న జేమ్స్ ట్రాక్ తప్పాడు.. గెలుపుకు సెకన్ల తేడా ఉంది. అది గమనించి డియాగో గమ్యస్థానానికి చేరుకున్నప్పటికీ ముగింపు గీత దాటకుండా ఉండిపోయాడు. తనకంటే ముందు స్థానంలో నిలిచిన జేమ్స్‌నే గీత దాటేలా చూశాడు. దీంతో జేమ్స్ డియాగోకు ధన్యవాదాలు తెలియజేశాడు.. డియాగో క్రీడాస్ఫూర్తిని ప్రేక్షకులు సైతం మెచ్చుకున్నారు. దీనిపై స్పందించిన డియాగో పందెంలో అతడు నాకంటే ముందున్నాడు.. అతడే దీనికి అర్హుడు అని అన్నాడు. ప్రస్తుతం పరుగుకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే 6.8 మిలియన్ల మంది వీక్షించారు.

Tags

Read MoreRead Less
Next Story