Northern Mali : పడవ, సైనిక స్థావరాలపై దాడి…64మంది మృతి

Northern Mali : పడవ, సైనిక స్థావరాలపై దాడి…64మంది మృతి
అల్‌ఖైదా అనుబంధ సంస్థ జిహాదీల పనే

ఉత్తర మాలిలో అల్ ఖైదా అనుబంధ సంస్థ జిహాదీలు దాడులకు తెగబడ్డారు. నైజర్ నదిలో టింబక్టు పడవ, ఉత్తర గావో ప్రాంతంలోని బాంబా వద్ద సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని జిహాదీలు దాడులు చేశారు. ప్రయాణికుల పడవ, సైనిక స్థావరాలపై జరిగిన దాడిలో 64 మంది మరణించారని మాలీ ప్రభుత్వం తెలిపింది. ఈ దాడుల్లో మాలి బోటులో 49 మంది పౌరులు, 15 మంది సైనికులు మరణించారు. నైజర్ నదిపై టింబక్టు పడవ, ఉత్తర గావో ప్రాంతంలోని బాంబా వద్ద ఆర్మీ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని జిహాదీలు దాడులు చేశారు. ఈ దాడులను అల్-ఖైదాకు అనుబంధంగా ఉన్న సమూహం జిహాదీలు చేశారని సమాచారం.


ఈ దాడిలో దాదాపు 50 మంది దుండగులు కూడా మరణించారు. వారు త్రీ టీమ్స్ గా దాడి చేశారు . నౌక కదలలేక జలమార్గంలో చిక్కుకుపోవడంతో ప్రయాణీకులను ఒడ్డుకు చేర్చడానికి సైనిక అధికారులు చాలా ఇబ్బందులు పడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పూర్తిగా ఖరారు కాలేదు . దాడుల్లో అనేక మంది మరణించడం, గాయపడటంతో మాలి తాత్కాలిక ప్రభుత్వం మూడు రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించింది. 2021 తిరుగుబాటు తరువాత నుండి, మాలిని తాత్కాలిక ప్రాతిపదికన కల్నల్ అస్సిమి గోయిటా నడిపించారు. ఐక్యరాజ్యసమితి ఈ దాడులను ఖండించింది. "పౌర, సైనిక లక్ష్యాలపై తీవ్రవాద దాడులలో వినాశకరమైన పెరుగుదల" అని అభిప్రాయ పడ్డారు.



మాలిని 2020 నుండి మిలటరీ జుంటా పాలిస్తోంది. అప్పటి ప్రెసిడెంట్ ఇబ్రహీం బౌబాకర్ కీటాకు వ్యతిరేకంగా సామూహిక నిరసనల తర్వాత జుంటా అధికారాన్ని స్వాధీనం చేసుకుంది. అప్పడు జుంటాకు భారీ ప్రజాదరణ లభించింది. కానీ ఆ తరువాత ఆర్థిక అనిశ్చితి, వివాదాస్పద ఎన్నికలు మరియు దీర్ఘకాలిక అభద్రత కారణంగా ప్రజలు ఆగ్రహానికి గురయ్యారు.అప్పటి నుండి, మాలి యొక్క సైనిక ప్రభుత్వం దేశంలోని కొన్ని భాగాలను నియంత్రించే ఇస్లామిస్టులకు వ్యతిరేకంగా పోరాతా;యూ జరుగుతున్నాయి.


Tags

Read MoreRead Less
Next Story