AUSTRALIA FLOODS EMERGENCY : ఆస్ట్రేలియాను ముంచెత్తుతున్న వరదలు

AUSTRALIA FLOODS EMERGENCY : ఆస్ట్రేలియాను ముంచెత్తుతున్న వరదలు
AUSTRALIA FLOODS EMERGENCY : ఆస్ట్రేలియాలో కుండపోతగా కురుస్తున్న వర్షాలతో పలు రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి.

AUSTRALIA FLOODS EMERGENCY: ఆస్ట్రేలియాలో కుండపోతగా కురుస్తున్న వర్షాలతో పలు రాష్ట్రాల్లో వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ రోజు కూడా కురిసిన కుండపోతల వర్షాలు ఆస్ట్రేలియా తూర్పు తీరాన్ని అతలాకుతలం చేస్తూనే ఉన్నాయి, సిడ్నీలో వరద.. సంక్షోభాన్ని తీవ్రతరం చేసింది, వరదలు సిడ్నీని ముంచెత్తాయి. దాదాపు 50వేల మంది వరదల్లో చిక్కుకున్నారు. నదులు వేగంగా ప్రమాద స్థాయిలను దాటాయి. దీంతో నాలుగోసారి ఫ్లడ్‌ ఎమర్జెన్సీని ఆస్ట్రేలియా ప్రకటించింది.

న్యూ సౌత్ వేల్స్‌ కూడా వరదలకు ప్రభావితమైంది. తుఫాన్‌ ప్రభావంతో మూడు రోజులుగా అనేక ప్రదేశాలలో భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పట్టణాలు-నీరూ ఒక్కటయ్యాయి. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అధికారులు శ్రమిస్తున్నారు.

ఆస్ట్రేలియాలో సాధారణంగా ప్రతీ సంవత్సరం 500మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదవుతుంది. తాజాగా 800మిల్లీ మీటర్లకు ఇది చేరుకుంది. ఈదురు గాలులు కూడా వేగంగా వీస్తున్నాయి. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండడంతో అక్కడక్కడా చెట్లు, విద్యుత్ స్థంభాలు నేలకొరిగాయి.

వరదలు తమను ఎప్పుడు ముంచెత్తుతాయోనని సాధారణ ప్రజలు భయాందోళనకు గురౌతున్నారు. కొందరు తమ ఇంటి ముందు పడవలను సిధ్దం చేసుకొని ఉంటున్నారు. పరిస్థితి తీవ్రమయితే పడవల సాయంతోనైనా తప్పించుకోవచ్చని అనుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story