Australia :.కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్

Australia :.కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్
ప్రమాదంలో నలుగురి గల్లంతు

ఆస్ట్రేలియా ఈశాన్య తీరంలో సైనిక విన్యాసాలు చేస్తుండగా ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఆకస్మాత్తుగా హెలికాఫ్టర్ నీటిలో మునిగిపోయింది. ఈ ఘటనలో నలుగురు గల్లంతు అయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి క్వీన్స్ ల్యాండ్ లోని హామిల్టన్ ద్వీపంలో సైనిక విన్యాసాలు చేస్తుండగా ఈ సంఘటన జరిగింది.

దీంతో నలుగురు ఎయిర్ క్రూ సిబ్బంది అదృశ్యమయ్యారని ఆస్ట్రేలియా రక్షణ శాఖ మంత్రి రిచర్డ్ మార్లెస్ శనివారం ప్రకటించారు. మరో హెలికాఫ్టర్ వీరిని వెతకడానికి రంగంలోకి దిగిందని మంచి వార్తలే వింటామని తమ భావిస్తున్నామని ఆయన ప్రకటించారు. సమాచారాన్ని వారి కుటుంబాలకు అందజేశామని అధికారులు చెప్పారు. శనివారం తెల్లవారుజామున ఒక ఐలాండ్ సమీపంలో శిథిలాలను గుర్తించారు.



జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, దక్షిణ కొరియా తో సహా 13 దేశాలకు చెందిన 30 వేల మంది సైనికులు పాల్గొన్న ఈ విన్యాసాలను ఈ అనుకోని ప్రమాదంతో నిలిపివేశారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్ ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి ఉన్నత స్థాయి సైనిక విన్యాసాలు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే నిర్వహిస్తారు. న్యూ గినియా, ఫిజి ఇంకా కొన్ని పసిఫిక్ ద్వీపదేశాలు ఈ సైనిక విన్యాసాలలో తొలిసారిగా పాల్గొంటున్నాయి ఆస్ట్రేలియా తన మిలిటరీలో కొంత కాలంగా సాయుధ బలగాలను బలోపేతం చేసింది. చైనా వంటి శత్రు దేశాలను ఆమడదూరంలో ఉంచేలా ఆర్మీ సామర్ధ్యాన్ని పెంపొందించుకుంది.

Tags

Read MoreRead Less
Next Story