వామ్మో.. అదేం మనిషి రెండున్నర గంటల పాటు ఐస్ క్యూబ్స్ మధ్యలో..

వామ్మో.. అదేం మనిషి రెండున్నర గంటల పాటు ఐస్ క్యూబ్స్ మధ్యలో..
X
నిండా మునిగినోడి చలేంటి అని ఏదో సామెత చెప్పినట్లు.. ఏకంగా ఓ ఐస్ క్యూబ్ బాక్స్ లో దిగి..

ఐస్ క్యూబ్ ని అయిదు నిమిషాలు అరచేతిలో పెట్టుకుంటేనే ఆ చల్లదనాన్ని తట్టుకోలేం. అలాంటిది.. నిండా మునిగినోడి చలేంటి అని ఏదో సామెత చెప్పినట్లు.. ఏకంగా ఓ ఐస్ క్యూబ్ బాక్స్ లో దిగి.. ముఖం మాత్రం పైకి కనిపించేలా రెండున్నర గంటల పాటు కూర్చుండిపోయాడు. ఆస్ట్రియాకు చెందిన ఓ వ్యక్తి. తన సొంత రికార్డును తానే బ్రేక్ చేసుకున్నాడు జోసెఫ్ కోబెర్ల్. ఐస్ క్యూబ్స్‌తో తన భుజాల వరకు నింపిన కస్టమ్ మేడ్ గ్లాస్ బాక్స్ లోపల 2 గంటల 30 నిమిషాల 57 సెకన్లు ఉండగలిగాడు. పెట్టెను నింపడానికి 200 కిలోగ్రాముల (440 పౌండ్ల) కంటే ఎక్కువ ఐస్ క్యూబ్స్ అవసరమయ్యాయి.

ఈ సందర్భంగా మాట్లాడిన జోసెఫ్ కోబెర్ల్.. గడ్డకట్టే చల్లదనం వల్ల కలిగే నొప్పితో పోరాడటానికి, తాను సానుకూల భావోద్వేగాలపై దృష్టి పెట్టడం ద్వారా అంతసేపు ఐస్ ముక్కల మధ్య ఉండగలిగానని చెప్పాడు. వచ్చే ఏడాది లాస్ ఏంజెల్స్ లో ఈ రికార్డును బ్రేక్ చేయనున్నట్లు తెలిపాడు. 2019 నుంచి ఇలా ఐస్ ముక్కల మధ్య ఉండడం ప్రాక్టీస్ చేస్తున్నానని, అప్పుడు అరగంట మాత్రమే ఉన్నానని చెప్పుకొచ్చాడు.

Tags

Next Story