Hijack: హైజాక్ గురైన నౌకలో భారతీయులు సేఫ్..

Hijack: హైజాక్ గురైన నౌకలో భారతీయులు సేఫ్..
తోకముడిచిన సోమాలియా పైరేట్లు

అరేబియా మహా సముద్రంలో హైజాక్‌కు గురైన నౌకలోకి సిబ్బందిని భారత నావికాదళం సురక్షితంగా కాపాడింది. 15 మంది భారతీయులతో సహా మెుత్తం 21 మందిని భారత నేవీ కమాండోలు కాపాడారు. నౌకాదళానికి చెందిన ఎలైట్ మెరైన్ కమాండోలు ఓడలో శానిటైజేషన్ ఆపరేషన్లు నిర్వహించి హైజాకర్లు పారిపోయారని నిర్ధారించింది. ఇందుకు సంబంధించిన వీడియోలను భారత నౌకాదళం విడుదల చేసింది.

అరేబియా సముద్రం సోమాలియా తీరంలో హైజాక్‌కు గురైన నౌకను భారత నౌకాదళం సురక్షితంగా రక్షించింది. అందులోని 15 మంది భారతీయ సిబ్బందితో పాటు మొత్తం 21 మందిని భారత నేవీ కమాండోలు కాపాడినట్లు నౌకాదళం ఓ ప్రకటన విడుదల చేసింది. ఓడను హైజాక్‌ చేసిన సముద్రపు దొంగలు భయపడి పారిపోయినట్లు వెల్లడించింది. అరేబియా సముద్రంలోని సోమాలియా తీరంలో MV లీలా నార్ ఫోక్ నౌక హైజాక్ గురైంది. సముద్రపు దొంగలు నౌకలోకి అక్రమంగా ప్రవేశించి ఓడను హైజాక్‌ చేశారు. నౌక హైజాక్‌కు గురైనట్లు గుర్తించిన బ్రిటీష్ మిలిటరీకి చెందిన UK మారిటైం ట్రేడ్ ఆపరేషన్స్ -UKMTO భారత నౌకాదళానికి సమాచారం ఇచ్చింది. వెంటనే స్పందించిన భారత నేవి కమాండోలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి అందులోని సిబ్బందిని రక్షించారు. నౌకాదళానికి చెందిన ఎలైట్ మెరైన్ కమాండోలు ఓడలో శానిటైజేషన్ ఆపరేషన్లు నిర్వహించి హైజాకర్లు లేరని నిర్ధారించినట్లు పేర్కొంది. ఈ ఘటన అనంతరం యుద్ధనౌక, సముద్ర గస్తీ విమానం, హెలికాప్టర్లు, P-8I, దీర్ఘ-శ్రేణి విమానం ప్రిడేటర్ MQ9B డ్రోన్‌లతో గస్తీ నిర్వహిస్తున్నట్లు తెలిపింది.

భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌక INS చెన్నై, సముద్ర గస్తీ విమానం, హెలికాప్టర్లు, డ్రోన్లను మోహరించి ఈ ఆపరేషన్‌ చేపట్టినట్లు తెలిపింది. అరేబియా సముద్రంలో హైజాక్ అయిన నౌకను భారత నౌకాదళం గుర్తించింది. అందులో ఉన్న భారతీయులు క్షేమంగా ఓ స్ట్రాంగ్ రూంలో ఉన్నట్లు నేవీ అధికారులు తెలుసుకున్నారు. మరోవైపు హైజాక్ అయిన నౌకను చుట్టుముట్టిన నేవీ కమాండోలు సముద్రపు దొంగలకు హెచ్చరికలు పంపారు. అనంతరం నౌకలోకి దిగి పరిశీలించిమొత్తం 15 మంది భారతీయులు సహా 21 మంది సిబ్బందిని కాపాడారు. సముద్రపు దొంగలు తొలుతనౌకపై కాల్పులకు పాల్పడ్డారని నేవీ అధికారులు వెల్లడించారు.

ఇజ్రాయెల్ -హమాస్ యుద్ధం వేళ ఎర్రసముద్రంలో నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. ఇటీవల హిందూ మహాసముద్రంలో కూడా ఈ ఘటనలు పెరుగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం భారత్ వస్తున్న ఓ వాణిజ్య నౌకపై గుజరాత్ తీరంలో డ్రోన్ దాడి జరిగింది. వెంటనే భారత నౌకాదళంICGS విక్రమ్ ను రంగంలోకి దించి సహాయ చర్యలు చేపట్టింది. ఆ ప్రమాదం నుంచి నౌకలోని 20 మంది భారతీయులు సహా సిబ్బంది అంతా సురక్షితంగా బయటపడ్డారని నౌకాదళం తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story