Avengers :ఆసుపత్రి బెడ్ పై ఎవెంజర్స్ హీరో సెల్ఫీ.. వైరల్

ఇటీవలె అమెరికాలో మంచు తఫాను కారణంగా ప్రముఖ హాలీవుడ్ నటుడు జెరెమీ రెన్నర్ గాయపడ్డ విషయం తెలిసిందే. తన భారీ వాహనంతో మంచును తొలగిస్తుండగా ప్రమాదానికి గురైన రెన్నర్ ను చికిత్స నిమిత్తం హుటాహుటిన హెలికాప్టర్‌లో ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని, అయినప్పటికీ ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యులు తెలిపారు.
ఇక ఆసుపత్రిలో చేరిన జెరెమీ రెన్నర్ కు వైద్యులు చికిత్స చేశారు. గాయపడిన తన కుడి మోచేయి, ఎడమ మణికట్టుకు చికిత్స అందించిన వైద్యులు ప్రస్తుతం తన పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. దీంతో అభిపానులు తమ ప్రార్ధనలు నిజమయ్యాయంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఇక రెన్నర్ తన ఫ్యాన్స్ ను ఆశ్చర్యపడిచేందుకు ఓ పోస్ట్ పెట్టాడు. ఆసుపత్రి బెడ్ పై చికిత్స పొందుతున్న తాను ఓ సెల్ఫీ తీసి పోస్ట్ చేశాడు. దీంతో రెన్నర్ ఆరోగ్యం క్రమేణా మెరుగుపడుతుందని, త్వరలోనే పూర్తిస్ధాయిలో కోలుకుంటాడని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా రెన్నర్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com