కరోనా యాంటిబాడిస్‌‌తో పుట్టిన చిన్నారి

కరోనా యాంటిబాడిస్‌‌తో పుట్టిన చిన్నారి

ఆమె కరోనా సీజన్లో గర్భం దాల్చింది. భయం భయంగానే రోజులు గడిపింది. పుట్టబోయే చిన్నారికి ఎలాంటి అవాంతరాలు ఎదురవకూడదని మనసులోనే మదన పడేది. ఇంతలో వ్యాక్సిన్ రావడంతో కడుపులో పెరుగుతున్న బిడ్డకు రక్షణగా తానూ టీకా తీసుకుంది అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఓ యువతి.

శరీరంలోకి కరోనా వైరస్ ప్రవేశించకుండా వ్యాక్సిన్ రక్షణ కవచంలా నిలిచింది. వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం నిశ్చింతగా నిద్ర పోయేది ఆమె. ఈ క్రమంలో ఆమె డెలివరీ డేట్ రానే వచ్చింది. వైద్యులు ఆమెకు సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు.

పాప పుట్టాక బొడ్డుతాడు నుంచి తీసిన రక్తంతో పరీక్షలు నిర్వహించారు వైద్యులు పాల్ గిల్బర్ట్, చాడ్ రుడ్నిక్. పుట్టిన పాపాయి అమ్మ కడుపులో ఉన్నప్పుడే వ్యాక్సిన్ తీసుకున్నందున ఆ చిన్నారిలో యాంటీ బాడీస్ తయారై ఉంటాయని తేల్చారు.

అయితే ఈ యాంటీ బాడీస్ ఎంతకాలం ఉంటాయి, వీటి నుంచి ఎంత వరకు రక్షణ ఉంటుందన్నది పరిశోధకులు తేల్చాల్సి ఉందని వారు చెప్పారు. దాని వల్ల గర్భంతో ఉన్న మహిళలకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చినందువల్ల ఏర్పడే పరిస్థితులు, ఇతర అంశాలపై స్సష్టత వస్తుందని పేర్కొన్నారు.

Read MoreRead Less
Next Story