Balakot Attack : భారత్, పాక్ అణుయుద్ధాన్ని అడ్డుకున్నాను

Balakot Attack : భారత్, పాక్ అణుయుద్ధాన్ని అడ్డుకున్నాను
పాకిస్థాన్ పై అణుదాడికి సిద్దమన్న సుష్మా స్వరాజ్ మాటలను విన్న వెంటనే ఉలిక్కిపడ్డా, సమస్య పరిష్కారానికి ఒక్క నిమిషం సమయం అడిగా...


బాలాకోట్ (2019) దాడి తర్వాత భారత్ పై అణు దాడి చేసేందుకు పాకిస్థాన్ సిద్దమైందని తెలిపారు అప్పటి అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి మైక్ పాంపియో. ఈ విషయాన్ని పూర్వ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కు తెలిపానని వెళ్లడించారు. పాకిస్థాన్ కు తగిన బుద్ది చేప్పేందుకు భారత్ సిద్ధమవుతుందన్న సుష్మా స్వరాజ్ మాటలతో తాను ఉలిక్కిపడ్డానని తెలిపారు. ఇరు దేశాలు అణుదాడికి సిద్ధమైతే తీవ్రనష్టం జరుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. 'నెవర్ గివ్ యాన్ ఇంచ్ ఫైటింగ్ ఫర్ ది అమెరికా ఐ లవ్' పేరుతో మైక్ రచించిన పుస్తకంలో ఆయన ఈ విశయాలను పొందుపరిచారు.


భారత్, పాక్ అణుయుద్దాన్ని నివారించడంలో తన టీం ఎంతగానో కృషి చేసిందని చెప్పుకొచ్చారు మైక్. "భారత్ కూడా అణుదాడికి సిద్దమన్న సుష్మా స్వరాజ్ మాటలను విన్న వెంటనే సమస్య పరిష్కారానికి ఒక్క నిమిషం సమయం అడిగాను. వెంటనే పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ జావెద్ బజ్వాతో మాట్లాడితే... పాక్ అణ్వాయుధాలను ప్రయేగించడం లేదని, భారత్ మాత్రమే అణుదాడికి రెడీ అవుతుందని ఆయన తెలిపారు. ఇరు దేశాల సమాచారాన్ని కమ్యునికేట్ చేసి అణు యుద్దం రాకుండా చూశాము" అని పుస్తకంలో రాసుకొచ్చారు మైక్ పాంపియో.


అసలేం జరిగింది..
ఫిబ్రవరి 14, 2019లో కశ్మీర్ లోని పుల్వామాలో, జవాన్లతో నిండిన భారత ఆర్మీ వెహికిల్స్ వెళ్తున్నాయి. అనుకోకుండా కాన్వాయ్ లోపలికి ఓ వెహికిల్ దూసుకొచ్చింది. అందులోని తీవ్రవాది తనను తాను పేల్చుకుని ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఆర్మీ వెహికిల్స్ మధ్య తీవ్ర పేలుడు సంభవించింది. 40మంది ఆర్మీ జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటనపై సీరియస్ అయిన భారత ప్రభుత్వం.. పాకిస్థాన్ లోయలో ఉన్న ఉగ్రవాదులను ఏరివేయడానికి బాలాకోట్ దాడి చేసింది. తీవ్రవాద స్థావరాలపై ఎయిర్ స్ట్రైక్ ద్వారా విరుచుకుపడింది. ఈ ఘటనలో ఉగ్ర స్థావరాలు పూర్తిగా ధ్వంసం అయినట్లు భారత ఆర్మీ ప్రకటించింది. పాకిస్థాన్ మాత్రం తమ దేశంలో భారత్ ఎయిర్ స్ట్రైక్ చేయలేదని చెప్పింది.

Tags

Next Story