Balesh Dhankhar: కొరియన్ మహిళలే టార్గెట్... మత్తుమందు ఇచ్చి, సెక్స్ టేప్ లు రికార్డ్ చేసి...

Balesh Dhankhar: కొరియన్ మహిళలే టార్గెట్...  మత్తుమందు ఇచ్చి, సెక్స్ టేప్ లు రికార్డ్ చేసి...
ఆస్ట్రేలియాలో భారతీయుడి నిర్వాకం; పోలీసుల అదుపులో బాలేష్ ధన్కర్; సెక్స్ టేపులు చూసి నివ్వెరపోయిన న్యాయనిర్ణేతలు..

ఓ వైపు ఆస్కార్ వేదికపై భారతీయులు తమ సత్తా చాటుకుంటూ దేశానికి గర్వకారణంగా నిలుస్తుంటే... మరోవైపు విదేశీగడ్డపై నీచమైన పనులకు పాల్పడుతూ దేశ ప్రతిష్ఠను మంటగలుపుతున్నారు మరికొందరు. భారతకు చెందిన బాలేష్ దిన్కర్ అనే వ్యక్తి ఆస్ట్రేలియాలో పలువురు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడటం ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. సిడ్నీలో స్థిరనివాశం ఏర్పరచుకున్న బాలేశ్, అక్కడి భారత కమ్యునిటీలో ప్రముఖుడిగా వెలుగొందుతున్నాడు. ఈ క్రమంలో తన పలుకుబడిని ఉపయోగించుకుని కొంతమంది యువతులను ట్రాప్ చేసి వారికి మత్తు మందు ఇచ్చి, వారు స్పృహ కోల్పోయాక లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా ఆ హీనమైన చర్యను రికార్డ్ చేసి ఆ వీడియోలను భధ్రంగా తన సిస్టమ్ లో దాచుకున్నాడు. మహిళల పేరిట వేరువేరు ఫోల్డర్లలో ఈ వీడియోలను నిక్షిప్తం చేశాడు.

కొరియన్ యువతులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి, కొరియన్ -ఇంగ్లీష్ తెలిసిన యువతులు కావాలంటూ పేపర్ యాడ్ లు ఇచ్చి మరీ సదరు యువతులను ట్రాప్ చేసేవాడు. సిడ్నీలోని హిల్టర్ హోటల్ లో గానీ, లేదా అక్కడికి దగ్గరలోని తన ఇంటిలో గానీ ఇంటర్వ్యూలు నిర్వహించేవాడు. అలా వచ్చిన యువతులకు మత్తుమందుతో కూడిన పానీయం ఇచ్చేవాడు. అలా స్పృహకోల్పోయిన తాము బాలేశ్ బెడ్ రూమ్ లో మెల్కొన్నట్లు కొంతమంది బాధితురాల్లు వెల్లడించారు. ఈ విధంగా సుమారు 13 మంది పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. 17 సెక్స్ వీడియోలను అతడి వద్ద నుంచి సేకరించినట్లు సిడ్నీ హెరాల్డ్ వెల్లడించింది. గడియారంలో పెట్టిన కెమెరా ద్వారా సదురు యువతులను నగ్నంగా చిత్రీకరించాడు. 2018 జనవరి నుంచి అక్టోబర్ మధ్యలో అతడు ఈ దాష్టికాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.

సిడ్నీలోని బాలేశ్ స్వగృహంలో సోదాలు నిర్వహించిన పోలీసులు అతడి బెడ్ రూమ్ లో డీఎన్ఏ సాంపిల్స్ తో పాటూ, ఫ్రిజ్ లో మత్తు మందు పదార్ధాలతో కూడిన వైన్ బోటళ్లను సీజ్ చేశారు. ఇక కోర్టులో సాక్ష్యంగా బాలేష్ తీసిన వీడియోలు చూసిన న్యాయనిర్ణేతలు రెండు నిమిషాల వ్యవధిలోనే వీడియోను ఆపేయాల్సిందిగా కోరారు. వారు చూడలేనంత జుగుప్సకరంగా ఆ వీడియోలు ఉండటం శోచనీయం. ఇక కోర్టులో ట్రైయిల్ జరుగుతుండగా తన లాయర్ల వెనుక సైలెంట్ గా కూర్చున్న బాలేశ్ ప్రస్తుతం కెమెరా కంట పడకుండా తప్పించుకు తిరుగుతున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story