Bangladesh: మళ్లీ లాక్‌డౌన్.. బంగ్లాదేశ్‌లో హైటెన్షన్..

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై మానవత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించి వందలాది మంది మరణాలకు కారణమైంది యూనస్ ప్రభుత్వం అభియోగాలు మోపింది. దీనిపై బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్‌లో విచారణ జరుగుతోంది. గతేడాది బంగ్లాదేశ్ హింసాత్మక అల్లర్లలో చాలా మంది మరణించారు. అల్లర్లు శృతిమించడంతో హసీనా తన పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారు...
ఈ కేసును విచారించిన బంగ్లా కోర్టు తీర్పును నవంబర్ 17కు వాయిదా వేసింది. ఆ రోజు ఆమెకు శిక్షలు ఖరారు చేయనుంది. గత ఏడాది అల్లర్ల సమయంలో మానవత్వానికి వ్యతిరేఖంగా ప్రవర్తించినట్లు ఆమెపై ఐదు అభియోగాలు ఉన్నాయి. హసీనాకు మరణశిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు కోరారు. షేక్ హసీనాతో పాటు అప్పటి హోం మంత్రి అసదుజ్జమాన ఖాన్ కమల్, అప్పటి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (IGP) చౌదరి అబ్దుల్లా అల్-మామున్‌లపై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం హసీనా, కమల్ పరారీలో ఉన్నట్లుగా నేరస్తులుగా విచారణ ఎదుర్కొంటున్నారు.
గత సంవత్సరం ఢాకాను కుదిపేసిన హింసలో దాదాపు 1,400 మంది మరణించి ఉండవచ్చని ఐక్యరాజ్యసమితి ఫిబ్రవరి నివేదికలో పేర్కొంది. చీఫ్ ప్రాసిక్యూటర్ మొహమ్మద్ తాజుల్ ఇస్లాం హసీనాకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. హసీనా 1,400 మరణశిక్షలు అర్హురాలు అని, ఆయన అన్నారు. “అది మానవీయంగా సాధ్యం కాదు కాబట్టి, మేము కనీసం ఒకదాన్ని డిమాండ్ చేస్తున్నాము,” అని ఆయన కోర్టును కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

