Sheikh Hasina: షేక్ హసీనాకు భారత్ తాత్కాలిక ఆశ్రయం..

రిజర్వేషన్ల కోటా కోసం ఆందోళనలతో దేశం అల్లకల్లోలంగా మారడంతో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా సోమవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. భద్రత కోసం పక్కనే ఉన్న భారత్‌కు ఆమె నిన్ననే (సోమవారం) వచ్చారు. అయితే ఆమె ఇక్కడ తాత్కాలిక నివాసం పొందేందుకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. భారత్‌లో ఆమె నివాసానికి తాత్కాలిక ఆమోదం మాత్రమే లభించిందని, యూకేలో ఆశ్రయం అంశం ప్రస్తుతం పెండింగ్‌లో ఉందని పేర్కొంది.
హసీనా యూకేలో ఆశ్రయం పొందాలనుకుంటున్నారని, అక్కడి ప్రభుత్వం నుంచి అనుమతి దక్కే వరకు ఆమె భారత్‌లోనే ఉంటారని ‘డైలీ సన్’ కథనం పేర్కొంది. షేక్ హసీనా రాజకీయ ఆశ్రయం విజ్ఞప్తికి సంబంధించి ప్రస్తుతానికి యూకే ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ధారణ లేదని పేర్కొంది. హసీనాతో పాటు ఆమె సోదరి రెహానా కూడా యూకేలో ఆశ్రయం కోసం ఎదురుచూస్తున్నారని ‘డైలీ సన్’ కథనం పేర్కొంది. కాగా హసీనాకు భారత్ పూర్తి ప్రయాణ సహకారం అందించనుందని వివరించింది.
షేక్ హసీనాతో పాటు ఆమె సోదరి రెహానా కూడా యూకేలో ఆశ్రయం కోసం ఎదురుచూస్తున్నారు. కాగా రెహానా కూతురు తులిప్ సిద్ధిక్ బ్రిటీష్ పార్లమెంటు ఎంపీగా ఉన్నారు. యూకేలో లేబర్ పార్టీకి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదివుంచితే బంగ్లాదేశ్‌లో వేగంగా మారిపోతున్న పరిణామాలను ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. బంగ్లాదేశ్‌లో పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షన కేబినెట్ సబ్ కమిటీ సోమవారం రాత్రి భేటీ అయ్యింది.
షేక్ హసీనా భారతదేశం నుండి ఎటువంటి రాజకీయ సహాయం కోరలేదు. ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్ ఎయిర్‌బేస్‌కు చేరుకుని ఆమెను కలిశారు. బంగ్లాదేశ్‌లోని పరిస్థితులపై గంటకు పైగా చర్చించారు. షేక్ హసీనా ఢాకాను విడిచిపెట్టాలనే ప్లాన్ గురించి ఢిల్లీకి ఇప్పటికే తెలుసు, కష్ట సమయాల్లో భారతదేశం మరోసారి స్నేహాహస్తాన్ని ప్రదర్శించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com