Bangladesh: హిందూ నేతల బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేసిన బంగ్లాదేశ్..
బంగ్లాదేశ్‌లోని మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై రాడికల్ ఇస్లామిస్టులు దాడులకు తెగబడుతున్నారు. ప్రధానిగా షేక్ హసీనా దిగిపోయిన తర్వాత అక్కడ మతోన్మాదులు హిందువుల్ని టార్గెట్ చేస్తున్నారు. హిందువుల వ్యాపారాలు, గుడులు, ఇళ్లపై దాడులుకు తెగబడుతున్నారు. తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ పాలన ఈ అరాచకాలను అడ్డుకోలేకపోతోంది.
హిందువుల హక్కుల గురించి నినదించిన ప్రముఖ హిందూ నేత, ఇస్కాన్ ప్రతినిధి చిన్మోయ్ కృష్ణదాస్‌ని అక్కడి ప్రభుత్వం దేశద్రోహం కేసు కింద అరెస్ట్ చేసింది. వరసగా హిందువుల్ని టార్గెట్ చేయడంపై భారత్ తన ఆందోళనని వ్యక్తం చేసింది. మైనారిటీల రక్షణను నిర్ధారించాలని కోరింది.
ఇదిలా ఉంటే, తాజాగా బంగ్లాదేశ్ మరింత దిగజారింది. పలువురు హిందూ నేతల బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేసింది. చిన్మోయ్ కృష్ణదాస్‌తో సమా 17 మంది ఖాతాలను 30 రోజుల పాటు స్తంభింపచేయాలని బంగ్లాదేశ్ అధికారులు ఆదేశించారు. బంగ్లాదేశ్ బ్యాంక్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (BFIU) గురువారం (నవంబర్ 28, 2024) వివిధ బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలకు ఈ ఆదేశాలను పంపింది. అన్ని రకాల లావాదేవీలను నెల పాటు నిలిపేయాలని కోరింది. ఈ 17 మంది వ్యక్తులకు సంబంధించిన అన్ని రకాల వ్యాపారాలు, ఖాతాల అప్డేట్స్, లావాదేవీల స్టేట్‌మెంట్‌లతో సహా అకౌంట్లకు సంబంధించిన అన్ని వివరాలనున మూడు రోజుల్లోగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమకు పంపాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com