Indian Flag – Bangladesh: బంగ్లాదేశ్‌లో భారత జాతీయ జెండాకి ఘోర అవమానం

భారత జాతీయ జెండాను కాళ్లతో తొక్కుకుంటూ వెళ్లిన బంగ్లాదేశ్ విద్యార్థులు

బంగ్లాదేశ్‌లో గత కొంతకాలంగా భారత వ్యతిరేక వాయిస్ వినిపిస్తుంది. తాజాగా భారత జాతీయ జెండాను అవమానిస్తున్నట్లు ఉన్న ఒక ఫొటో సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటన, బంగ్లాదేశ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలోకి వెళ్తున్న విద్యార్థులు.. ఆ సంస్థ గేటు దగ్గర నేలపై పరచి ఉన్న ఇండియన్ ఫ్లాగ్ ను తొక్కుకుంటూ వెళ్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోని నెట్టింట పోస్ట్ చేశారు. ఆ ట్విట్ లో భారత జాతీయ జెండాను తొక్కుతూ.. బంగ్లాదేశ్ లో సమస్యలకు కారణం ఏంటని క్వాప్షన్ ఇచ్చారు.

అయితే, మాజీ ప్రధాని షేక్ హసీనాను భారత్ అప్పగించకపోవడంతో.. బంగ్లాదేశ్‌లో ఇండియాపై వ్యతిరేకత పెరుగిపోతుందనే వాదన స్పష్టంగా కనిపిస్తుంది. అలాగని భారత్, బంగ్లాదేశ్ అరాచక శక్తులకు తలొగ్గే ఛాన్స్ కూడా లేదు. కాకపోతే, ఈ భారత వ్యతిరేక ధోరణి కొంత మేర మనకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. దీనిపై ఇండియా.. రాజకీయంగా, దౌత్య పరంగా, శాంతియుతంగా ముందుకెళ్లడం మంచిదనే వాదన వినిపిస్తుంది.

కాగా, బంగ్లాదేశ్ కోరినట్లుగా షేక్ హసీనాను ఆ దేశానికి అప్పగించేందుకు భారత్ ఏమాత్రం కనిపించడం లేదు. మొదటి నుంచి షేక్ హసీనా కుటుంబానికి భారత్ సపోర్టుగా ఉంటుంది. దాంతో ఆమెను బంగ్లాకు అప్పగించేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతుంది. అయితే, హసీనా ఏ దేశానికి వెళ్లాలని అనుకుంటే అక్కడికి పంపించేందుకు భారత్ ఏర్పాట్లు చేసేందుకు రెడీగా ఉంది.

మరోవైపు శుక్రవారం బంగ్లాదేశ్‌లోని చటోగ్రామ్ నగరంలో మూడు హిందూ దేవాలయాలను దుండగులు ధ్వంసం చేశారు. స్థానిక మీడియా వివరాలు ప్రకారం, మధ్యాహ్నం 2:30 గంటలకు హరీష్ చంద్ర మున్సెఫ్ లేన్‌లో ఈ ఘటన జరిగింది. శాంతనేశ్వరి మాత్రి ఆలయం, శని మందిరం, శాంతనేశ్వరి కలిబారి ఆలయాల్లో ఈ దాడులు జరిగాయి. వందలాది మంది ఉర్రూతలూగిస్తూ నినాదాలు చేస్తూ ఆలయాలపై రాళ్లు, ఇటుకలు విసిరారు. ఈ దాడిలో ఆలయ ద్వారాలు ధ్వంసమయ్యాయి. కొట్లవలి పోలీస్ స్టేషన్ చీఫ్ అబ్దుల్ కరీం ఈ దాడిని ధ్రువీకరించారు. దాడి తర్వాత, శాంతినేశ్వరి ఆలయ నిర్వహణ కమిటీ సభ్యుడు తపన్ దాస్ స్పందించారు.

Tags

Next Story