Swaminarayan Temple: కెనడాలో మరోసారి మోడీకి వ్యతిరేకంగా నినాదాలు..
కెనడాలో హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎడ్మింటన్‌లోని బీఏపీఎస్ స్వామినారాయణ్ ఆలయంపై దుండగులు గ్రాఫిటీ పెయింట్‌వేశారు. ప్రధాని మోదీ, భారత సంతతికి చెందిన ఎంపీ చంద్ర ఆర్య కెనడా వ్యతిరేకులు అంటూ ఆలయ గేటుపై రాశారు. దీనిపై కెనడాలోని విశ్వహిందూ పరిషత్ మండిపడింది. తీవ్రవాద భావజాలంతో కొందరు హెచ్చుమీరుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కెనడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మన దేశంలో శాంతిని ప్రేమించే హిందూ సమాజంపై ద్వేషాన్ని చిమ్ముతున్న తీవ్రవాద భావజాలానికి వ్యతిరేకంగా నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని దేశంలోని అన్ని స్థాయిల ప్రభుత్వాలను కోరుతున్నామని ఎక్స్ వేదికగా కోరింది.
స్వామి నారాయణ్ ఆలయం విధ్వంసాన్ని ఎంపీ చంద్ర మౌర్య ఖండించారు. ఎడ్మింటన్‌లో బీఏపీఎస్ స్వామి నారాయణ్ ఆలయం మళ్లీ ధ్వంసమైంది. ఖలిస్థానీ వేర్పాటువాదులు ఇలాంటి గ్రాఫిటీలు రాయడం ఇదే మొదటిసారి కాదు. గత కొన్నేండ్లుగా గ్రేటర్ టొరంటో, బ్రిటిష్ కొలంబియా, కెనడాలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న హిందూ దేవాలయాలు ద్వేషపూరిత గ్రాఫిటీలతో విధ్వంసానికి గురవుతున్నాయని ఎక్స్‌లో పేర్కొన్నారు. కెనడాలోని హిందూ దేవాలయాలపై ఇలాంటి దాడులు తరచూ జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com